
Entertainment


సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ
ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్ ఆ తర్వాత సినిమాల…

పుష్ప2 కోసం స్టార్ క్రికెటర్లు బరిలో దిగుతున్నారా?
అల్లు అర్జున్ రీసెంట్ సెన్సేషన్ పుష్ప2 చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే ప్రచారపర్వంలో ఎక్కడా తగ్గకూడదని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రచారం కోసం భారీ ప్లాన్ వేశారు. దానికి తగ్గట్టుగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం జరుగుతోంది. వివిధ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈవెంట్స్ ను నిర్వహించే స్కెచ్ వేసింది. నార్త్ ఇండియాలోని అన్ని స్టేట్స్ లో కూడా ఈ…

డీఎస్పీ అవుట్, ఆ ముగ్గురే పుష్ప 2ని ఫైనల్ కంపోజర్స్?
దేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందా? అంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ అనే చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి క్రేజ్ ఉన్న సినిమా నిత్యం వార్తల్లో మునిగి తేలుతున్నది.అందుకే పుష్ప టీమ్ నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను తొలగించడమనే అంశం అత్యంత చర్చనీయాంశమైంది. డీఎస్పీ, సుకుమార్ మధ్య రాజుకున్న వివాదమే దానికి కారణమనే…

అనుష్క మళ్లీ వస్తోంది.. వేదం కాంబినేషన్ రిపీట్!
అనుష్క శెట్టి.. దాదాపు దశాబ్దకాలం పాటు టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్. కానీ కొంతకాలంగా దాదాపు తెరమరుగు అయిపోయింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం వచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి అనుష్క నటించిన సినిమా ఏదీ రాలేదు. దాంతో ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తారా అన్న చర్చ కూడా సాగింది. చివరకు ఆమె కొత్త ప్రాజెక్ట్ ఒకటి పూర్తికాబోతోంది. ‘ఘాటీ’ అంటూ ఓ భారీ బడ్జెట్ చిత్రం సిద్ధమవుతోంది. అది కూడా డైరెక్టర్ క్రిష్…

తెలుగువారిని అంతఃపురం సేవకులుగా వర్ణించిన సినీ నటి!
సినీ నటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగువారి పట్ల చేసిన విమర్శలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. ఆ నటి తీరు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకి ఆమె తలొగ్గాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా సీనియర్ నటి కస్తూరి కామెంట్స్ కారణంగా చెలరేగిన కలకలం తర్వాత పరిస్థితి. తాజాగా తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమె తెలుగువారినుద్దేశించి చేసిన…

ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ వివాదాలు, అడుగులు పడేనా?
ఏపీకి కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది అంతుబట్టకుండా ఉంది. ఆఖరికి అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్ల నిధులు కూడా అప్పుగానా, గ్రాంట్ గానా అన్నది సందేహంగా కనిపిస్తోంది. ఈ సందిగ్ధం కొనసాగుతున్న వేళ తాజాగా కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ ప్రకటనలు చిచ్చుపెడుతున్నాయి. బహుశా పౌరవిమానయాన శాఖ టీడీపీ ఎంపీ చేతిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే ఎక్కువ ఫలితాలను ఆశిస్తూ ఎయిర్ పోర్టుల చుట్టూ హంగామా చేస్తున్నారా అన్న చర్చ…

గోదావరి పుష్కరాల ముహూర్తమిదే, ఈసారి వచ్చే యాత్రికులెందరంటే!
కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. దీంతో, ప్రభుత్వం..స్థానిక నేతలు – యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి…

మీకు 2 రోజుల పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఆగిపోతాయి, ఎవరికి, ఎప్పుడో తెలుసా?
యూపీఐ వ్యవస్థ ఇప్పుడు సర్వజనీనమయిపోయింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకూ అందరూ స్కానర్ ద్వారా పేమెంట్స్ కి ప్రాధాన్యతనిస్తున్నారు. నెలా నెలా పెరుగుతున్న లావాదేవీలతో యూపీఐ పేమెంట్స్ రికార్డుల మోత మోగిస్తోంది. అయితే తాజాగా బ్యాంకుల నిర్వహణ కోసమంటూ యూపీఐ కార్యకలాపాలు బంద్ చేయబోతున్నారు. రెండు రోజుల పాటు వాటిని నిలిపివేసే అవకాశం ఉంది. నవంబర్ లోనే HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు ఈ సేవలు నిలిపివేయబోతోంది. తొలుత HDFC అకౌంట్ హోల్డర్లకు రెండు…

పుష్ప2 కోసం అల్లు అర్జున్ తో చిందేయబోతున్న శ్రీలీల, మరి సమంత?
ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటింగ్ గా క్రేజీ సీక్వెల్ సినిమా ఏది అంటే “పుష్ప 2” అనే చెబుతారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు హీరోగా దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమాగా ఇది రాగ భారీ విజయాన్ని సాధించి ఇపుడు పార్ట్ 2 కి ఎనలేని హైప్ ని తెచ్చుకుంది. పార్ట్ 1 ఎండింగ్ లో ఒక కేజీయఫ్, బాహుబలి లాంటి ఎగ్జైటింగ్ ఎండింగ్ లేకపోయినప్పటికీ పుష్ప 2 కి వాటికి మించిన…