
పిఠాపురం వర్మ మీద వేటు తప్పదా, పవన్ కళ్యాణ్ తో వివాదానికి ప్రతిఫలం చెల్లించాల్సిందేనా?
నేరుగా కాకున్నా.. పరోక్షంగానైనా పిఠాపురం వర్మ.. జనసేనానితో యుద్దానికి కాలు దువ్వుతున్నట్టే కన్పిస్తోంది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే రకమైన డౌట్లు వస్తున్నాయి. పిఠాపురం సెగ్మెంట్లో వర్మకు బలం ఉంటే ఉండొచ్చు.. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ పవన్ కల్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో.. అది కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ అధినేతతో నేరుగా యుద్దానికి దిగేటంతటి రేంజీకి పరిస్థితిని తెచ్చుకోవడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బందని…