ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్! చంద్రబాబు మళ్లీ వెనక్కి మళ్లుతున్నారా?

చంద్రబాబు పదే పదే టెక్నాలజీకి సంబంధించిన పదాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం ఆశ్చర్యం ఏమీ కాదు. దశాబ్దాలుగా ఆయన పాలనా విధానంలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఆనాటికి టెక్ ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలను ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. అందరికీ గుర్తుండే ఉంటుంది..2019 కి పూర్వం ఆయన పదే పదే లాజిస్టిక్స్ హబ్ అంటూ చెప్పుకొచ్చేవారు. విశాఖను లాజిస్టిక్స్ హబ్ గా చేస్తానని కూడా ఆయన అన్నారు. మరి ఇప్పుడెందుకు ఆయన మాట మరచిపోయారు. ఇప్పుడెందుకు డీప్…

Read More

బాలినేనికి మరో ఎదురుదెబ్బ, మాజీ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జనసేన

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన నాటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే. తాజాగా మరోసారి ఆశాభంగమయ్యింది. తొలుత ఆయన ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరాలని ఆశించారు. కానీ ఆపార్టీ అధిష్టానం అందుకు భిన్నంగా ఆలోచించింది. కనీసం బాలినేని అనుచరులను కూడా వెంట తీసుకురాకుండా ఆయనతో పాటు అతి కొద్దిమందికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అయినా సర్థుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని భారీ సభ…

Read More

ఇల్లు కడుతున్నారా? మంచి సిమెంట్ ఎంపిక చేసుకోవడం ఎలా? పూర్తి వివరాలతో!

ఎంతో మంది ఇళ్లు లేదా భవన నిర్మాణాలు చేపడుతుంటారు.కాని అందులో కొందరికి మాత్రమే ఆయా నిర్మాణాలలో ఏ రకమైన “సిమెంట్” వాడాలో తెలిసి ఉంటుంది. ఆ విషయాలు తెలియని వారు అటువంటి విలువైన సాంకేతిక సమాచారం కోసం చదవ వచ్చు.. “ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు” అంటుంటారు పెద్దలు.చాలామందికి సొంతిల్లు సమకూర్చుకోవడం ఒక కల. దాన్ని సాకారం చేసుకోవడానికి వారు పడే కష్టం వర్ణనాతీతం.అలాంటి ఇల్లు మూడు తరాల పాటు నిక్షేపంగా నిలవాలంటే దాని…

Read More

కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేయలేమని తేల్చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న పనామా స్టెల్లా షిప్ ను సీజ్ చేయలేమని ఏపీ ప్రభుత్వం తేల్చేసింది. అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దానికి తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు సహా ఇతర అక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ…

Read More

కాకినాడ: అప్పుడు డీప్ వాటర్ పోర్టు, ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ బలి చేస్తున్నారా?

కాకినాడ పోర్ట్ వ్యవహారం పెను దుమారం దిశగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ రాజేసిన వివాదం ఇప్పట్లో సర్థుమణిగేలా లేదు. దానికి కారణం ఏకంగా కాకినాడలో సుదీర్ఘ చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్ట్ మీద ప్రభుత్వం కన్నేసిందన్న ప్రచారమే. ఏకంగా యాంకరేజ్ పోర్ట్ మూతవేసే దిశలో ఉందంటూ వస్తున్న కథనాలే అందుకు కారణంగా కనిపిస్తోంది. కాకినాడ తీరం కొంత భిన్నంగా ఉంటుంది. కాకినాడ పోర్టుకి ఎదురుగా బంగాళాఖాతంలో హోప్ ఐలాండ్ ఏర్పడడం,…

Read More

రేషన్ అక్రమరవాణాకు మూలం అవేనట..మాఫియా నియంత్రణ కష్టమట!

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఏపీలో రేషన్ బియ్యం మాఫియాకు డోర్ డెలివరీ కోసమంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు కారణమంటూ విమర్శించారు. ఏకంగా 1600 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాల ద్వారా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకుని అక్రమంగా బియ్యం తరలిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దానికి ఆధారంగా గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలలో జరిగిన బియ్యం ఎగుమతుల విలువను వెల్లడించారు. రూ. 48,537 కోట్ల విలువైన బియ్యం కాకినాడ…

Read More

రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి కారకులెవరు? పవన్ కి ఇది అర్థమయితేనే!

సమస్య మూలాల నుంచి పరిష్కరించాలి. పైపై పూతలు కొంతకాలమే ఫలిస్తాయి. మళ్లీ మళ్లీ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. సరిగ్గా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అదే జరుగుతుంది. ఎవరైనా అధికారి లేదా ఇంకో నాయకుడు సందడి చేసిన సమయంలో ఓ వారం సర్ధుమణగడం, మళ్లీ చెలరేగిపోవడం అన్నది ఆనవాయితీగా మారుతోంది. మొన్నటి జూన్ లో ఇదే జరిగింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించగానే కాకినాడ వెళ్లారు. కలియ తిరిగారు….

Read More

రేషన్ బియ్యం మాఫియాపై రంగంలోకి పవన్ కళ్యాణ్‌, అధికారులపై సీరియస్

కాకినాడ నుంచి పోర్ట్ నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం వ్యవహారం దుమరం రేపుతోంది. రేషన్ బియ్యం మాఫియా యధేశ్ఛగా బియ్యం తరలింపు సాగిస్తున్న తరుణంలో నేరుగా డిప్యూటీ సీఎం రంగంలో దిగడం ఆసక్తిగా మారింది. కాకినాడ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్…

Read More

జమ్మలమడుగు ఆదినారాయణ సంగతి చూస్తామంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. ఇప్పటికే అదానీ సంస్థల కాంట్రాక్ట్ తీసుకున్న సీఎం రమేశ్ తో తగాదా ఏకంగా ఆస్తుల ధ్వంసం వరకూ వెళ్లింది. తాజాగా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు అడ్డుకునే వరకూ సాగుతోంది. దీని మీద జేసీ ఘాటుగా స్పందించారు. కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్‌ తరలిస్తున్న జేసీకి చెందిన వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తమ…

Read More

అదానీ కేసులో ఏపీ ఐఏఎస్ లు కూడా ఇరుక్కుంటారా?

అదానీ సంస్థల మీద అమెరికాలో నమోదయిన కేసు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయంగానూ, అధికార వర్గాల్లోనూ విస్తృత చర్చకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయం రంజుగా సాగుతోంది. అమెరికా అధికారులు కోర్టులో సమర్పించిన పత్రాల్లో మాజీ సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఏపీలో దీనికి సంబంధించి హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఓవైపు ఈ రాజకీయం రంజుగా సాగుతుండగానే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఓ ట్విట్ ఈ ఎపిసోడును…

Read More