
ఇళయరాజాకి కులవివక్ష, గర్భగుడి ప్రవేశాన్ని అడ్డుకున్న అర్చకులు, జీయర్లు
దేశంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి చుక్కెదురయ్యింది. ఆయన ఆలయంలో అడుగుపెట్టే ప్రయత్నానికి అభ్యంతరం వ్యక్తమయ్యింది. గర్భగుడిలో ఆయన ప్రవేశించడానికి నిరాకరించారు. దాంతో ఇళయరాజా నిరాశ చెందాల్సి వచ్చింది. గర్భగుడిలోకి వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా ‘గర్బగుడిలోకి మీకు లోపలికి ప్రవేశం లేదని’ పూజారులు, జీయర్లు వెనక్కి పంపించేశారు. తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. గర్భుగడిలో ప్రవేశించేందుకు చేసిన యత్నానికి స్థానిక పూజార్లు, ఆలయ అర్చకులు అంగీకరించకపోవడం వివాదంగా మారుతోంది. ఇళయరాజా…