సమిష్టి నాయకత్వంతోనే సంక్షేమం : హరిప్రసాద్

ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఉచిత సిలిండర్ల కార్యక్రమాన్ని సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్యం ఎన్నికలముందు ఇచ్చిన హామీ ప్రకారం దీపం 2 పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. దిగువ మధ్య తరగతి ఇళ్ళల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ ఉచిత సిలిండర్ల పథకానికి రు.2864 కోట్లకు పైగా ఏడాదికి ఖర్చవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ ఆర్థికంగా లాభదాయకమన్నారు. ఇంత సంక్షేమం సమర్థవంతమైన నాయకత్వం వల్లే జరిగిందని వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ , కాకినాడ జిల్లా జెఎస్పి అధ్యక్షుడు, తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమీషనర్ కనకారావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *