యురేనియం తవ్వకాలపై పవన్ వైఖరి మారిందా?

ప్రతిపక్ష నాయకులు చేసే పోరాటం ఆ కాలానికే సరిపోతుందా? వారు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించలేరా? నేడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు గతంలో చెప్పిన మాట ఏమిటి ? నేడు చేస్తుంది ఏమిటి? యురేనియం తవ్వకాలను ఆపాలి.. నల్లమల అడవులను రక్షించాలని నాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి లు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇది తెలుగు వారి సమస్యని రాష్ట్రాలను పక్కన పెట్టీ ఉమ్మడిగా కలిసి పోరాటం చెద్దామని కోరారు.ఐదేళ్ళు గడిచాయి. వీరు వారు అయ్యారు. వారు వీరు అయ్యారు. నాడు పోరాటం చేసిన వారే..నేడు రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కానీ యురేనియం తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరి మారింది.నాడు కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన జనసేనాని నేడు అదే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు.

రాష్ట్రాల హక్కులును కాపాడాల్సిన పాలకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వంతపాడుతున్నరాన్న విమర్శలు మూట కట్టుకుంటున్నారు. పర్యాటక రంగం పై అమిత ప్రేమ చూపించే పవన్ కళ్యాణ్ నల్లమల అటవీ ప్రాంతం పట్ల ఎందుకు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగింపు పై అస్పష్టత, అమరావతి కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గ్రాంటా? అప్పు నా తెలియని పరిస్థితి ఎన్డీయే ప్రభుత్వంలో ఉంది.నిన్న కర్నూల్ జిల్లాలో ప్రారంభం అయిన తవ్వకాలు..రేపు తెలంగాణ లోని మహబూబ్ నగర్ లో ఎందుకు జరగవు. అప్పుడు అయిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విధానం ఎలా ఉండనున్నది పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తవ్వకాలకు వ్యతిరేకంగా శనివారం కర్నూలు జిల్లా కప్పట్ట్రాల మారుమ్రోగింది. యురేనియం తవ్వకాలు చేపడితే ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురి అయ్యే ప్రమాదం ఉంది.పచ్చని పొలాలు బిడువారుతాయి అని ఎమ్మెల్యే విరూపాక్ష ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్…సహజ వనరులను కాపాడే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్న విమర్శ ఉంది యురేనియం తవ్వకాలపై సిఎం, డిప్యూటీ సిఎం లు నోరు విప్పాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *