ఎన్డీయేను ఇరుకున పెడతారా? మళ్లీ మొహం చాటేస్తారా?
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుతిరి ఐదు నెలలు గడిచిపోయింది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన సుపర్ సిక్స్ లోని కీలక హామీలు ఇంకా అమలులోకి రాలేదు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి కింద 20,000 ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి కింద 3000 , 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు వంటి కీలక హామీలు అమలులోకి రాలేదు.ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయాల్సిన ప్రతిపక్ష శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మాజీ సిఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో మాత్రమే జగన్ అసెంబ్లీకి హాజరు అయ్యారు. ఎన్డీయే ఇచ్చిన హామీలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష సభ్యులు కరువయ్యారు.
జగన్ కు కలిసివచ్చే అంశాలు..
ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి రాష్ట్ర బడ్జెట్ ను ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెడుతున్నారు.వివిధ రంగాల్లో కేటాయింపులపై ప్రశ్నించవచ్చు. పోలవరం ఎత్తు తగ్గింపు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలు, కప్పట్రాల లో యురేనియం తవ్వకాలు, ఉచిత ఇసుక విధానంలో ఎమ్మెల్యేల జోక్యం, బెల్ట్ షాప్ నియంత్రణలపై , కేంద్రం నుంచి రాష్ట్రానికి రాష్ట్రానికి రావాల్సిన నిధులు,టిడిపి మంత్రి పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శలు అన్నీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇలాంటి అవకాశాన్ని జగన్ వధులుకుంటారా? ఇంకా ఓటమి నుంచి తెరుకోరా? నాయకులకు, కార్యకర్తలకు బరోసా కల్పించే ప్రయత్నం చేయరా ? అనేక ప్రశ్నలు జగన్ చుట్టూ ఉదయిస్తున్నాయి.అసెంబ్లీ కి రాకుండా పార్టీ నిర్మాణంపై జగన్ దృష్టి సారిస్తారా? ప్రజాస్వామ్యాన్ని,ప్రజా తీర్పును గౌరవిస్తూ అసెంబ్లీ కి వచ్చి ప్రజా గళం వినిపిస్తారా తెలియాటలంటే శాసనసభ సమావేశాలకు వరకు ఆగాల్సిందే.