లౌకిక రాజ్యానికి ప్రతీకగా విశాఖ రాస్‌హిల్ … విశాఖ కన్నెమరియ గుడికి నాగులచవితి శోభ
భారతీయత సంస్కృతికి మూలం భిన్నత్వంలో ఏకత్వమే. వేల ఏళ్లుగా అది మన సంస్కృతిలో జీర్ణించుకు పోయింది. కుల, మత విభేదాలు వెర్రితలలు వేసే ఘర్షణలు అక్కడ లేవు. ఆచారం, అనాచారం అసుంటసుంట వంటి విభజన రేఖలు అక్కడ భూతద్ధం పెట్టినా కనిపించవు. ఇదంతా ఆధునిక నాగరిక సమాజానికి దూరంగా ఎక్కడో అడవుల్లోనో, ఏ కొండ కోనల్లోనో అనుకుంటే తప్పులో కాలు వేసినట్టే. అన్ని రంగాల‌్లో అంతర్జాతీయ ప్రమాణాలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరంలోనే. అన్యమత ప్రచారం…