సూపర్ స్టార్ కృష్ణకి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పోలిక ఏంటి?
తెలుగునాట ఎవరికిష్టమున్నా లేకున్నా సినిమాల ప్రభావం అసామాన్యం. సినీ హీరోలను కొలిచే యువతరం ఎప్పుడూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా సినిమాల నుంచి వచ్చి రాజకీయాలను, ప్రజల జీవితాలను శాసించే ప్రయత్నం కొందరు చేస్తుంటారు. వారిలో కొందరు సక్సెస్ అయిన చరిత్ర కూడా తెలుగునేల మీద ఉంది. తెలుగు హీరోలలో నెంబర్ వన్ గేమ్ ఆరంభం నుంచి ఆసక్తికరమే. అందులోనూ ఎన్టీఆర్ హవా సాగిన తర్వాత ఆయన కొత్త ట్రాక్ ఎంచుకోవడంతో ఆయన తర్వాత ఎవరూ అన్న ప్రశ్న…