ఏపీ శాసనమండలిలో పెరిగిన పీడీఎఫ్‌ బలం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఊపు

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో పీడీఎఫ్‌ తన బలం పెంచుకుంది. సిట్టింగ్ టీచర్ సీటుని నిలబెట్టుకుంది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీటుకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. 65 శాతం పైబడి ఓట్లు దక్కించుకుంది. త్వరలో జరగబోతున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికలకు తమ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది.

టీచర్ ఎమ్మెల్సీగా ఉండగా షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆ సీటుకి ఉప ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి సునాయాసంగా విజయం సాధించారు. ఏకపక్షంగా తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం దక్కించుకున్నారు. సమీప ప్రత్యర్థి గంథం నారాయణరావుని చిత్తుగా ఓడించారు.

అభ్యర్థుల వారీగా ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఏకంగా 65 శాతం పైబడి ఓట్లను సాధించడం విశేషం. 50 శాతం ఓట్లతోనే ఎమ్మెల్సీ గెలపు ఖాయం కాగా, పీడీఎఫ్ అభ్యర్థికి పెద్ద స్థాయిలో ఆదరణ కనిపించింది. శాసనమండలిలో ప్రస్తుతం పీడీఎఫ్ కి ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. మరో ఎమ్మెల్సీ తోడు కావడంతో వారి బలం నాలుగుకి చేరుతోంది.

వచ్చే ఫిబ్రవరిలో గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ సీటుతో పాటుగా కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు సీట్లు ప్రస్తుతం పీడీఎఫ్ చేతిలో ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు ప్రారంభించింది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీటు గెలుపు అందుకు తోడ్పడుతుందని భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *