వాళ్ల తర్వాత నితీశ్ రెడ్డేనా! కపిల్, అమర్నాథ్ వంటి వారి బాటలో సాగుతాడా?
నిజానికి దేశంలోనే మిగతా క్రికెట్ అసోషియేషన్ల కంటే చిన్నదైనా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) నుండి టీమ్ ఇండియా జట్టులో ఈ మధ్య కాలంలో కాస్త ప్రాతినిధ్యం పెరగడం కాస్త గుడ్ న్యూస్! దానిలో భాగంగానే ఇక్కడ నుండి మొదట MSK ప్రసాద్.. KS భరత్.. హనుమ విహారి ల తర్వాత ఇప్పుడు నాలుగో వాడిగా నితీష్ కుమార్ రెడ్డి (NKR) ఇండియా టెస్ట్ క్యాప్ ధరించడంతో పాటు సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ అంచనాలకు తగ్గట్టు ఈ యంగ్ క్రికెటర్ ఆడుతుండడం మంచి విషయం!
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నితీష్ కెరీర్ తొలి రోజుల్లో వెన్నుండి అతన్ని మంచి అల్ రౌండర్ గా తీర్చిదిద్దిన కడప ఆంధ్రా క్రికెట్ అకాడమీ(ACA) వారిని ఇక్కడ ప్రత్యేకంగా అభినందించాలి! ఈ అకాడమీ ద్వారా ఇప్పుడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించి వారికి పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తుంది!
వాస్తవానికి ఇప్పుడు IPL స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో పెద్ద ఎత్తున యంగ్ టాలెంట్ కు ఎక్సపోజర్ దొరుకుతున్నపటికి.. టెస్టు క్రికెట్ ఆడగల క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లోటు మాత్రం చాలా రోజుల నుండి టీమ్ ఇండియాను ఇబ్బంది పెడుతూనే ఉంది!
80 వ దశకం తొలినాళ్ళలో కపిల్ దేవ్.. మొహిందర్ అమరనాథ్.. మదన్ లాల్.. రోజర్ బిన్నీ లాంటి వాళ్ల రూపంలో మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటమే 83 వరల్డ్ కప్ ను అనూహ్యంగా ఇండియా గెలవడానికి ముఖ్య కారణం! ఆ తర్వాత ఈ స్థాయిలో ఈ స్థానాన్ని భర్తీ చేసే ఆల్‌రౌండర్స్ దొరక్కపోవడం ఇండియా దురదృష్టం!
అడపాదడపా మధ్యలో మనోజ్ ప్రభాకర్.. చేతన్ శర్మ.. రాబిన్ సింగ్.. సౌరవ్ గంగూలీ.. అజిత్ అగార్కర్.. రీతిందర్ సింగ్ సోడి.. ఇర్ఫాన్ పఠాన్.. జోగిందర్ శర్మ.. స్టువార్ట్ బిన్నీ.. విజయ్ శంకర్.. హార్ధిక్ పటేల్ తదితరులు తమ ఆల్ రౌండర్ ప్రతిభతో టీమ్ లో చోటు దక్కించుకున్న వీరిలో కెరీర్ తొలి నాళ్లలోనే పూర్తి స్థాయి ఓపెనర్ గా మారిన సౌరబ్ గంగూలీ, బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ లను పక్కన పెడితే.. మిగతా వారిలో రాబిన్ సింగ్.. హార్థిక్ పాండ్య.. లేటెస్ట్ గా శివం దూబే.. లాంటి వారు వన్డే, టీ-20 ఫార్మాట్లలో రాణించినప్పటికీ.. టెస్ట్ క్రికెట్ కు సరిపడే ఆటగాళ్ళు కాకపోవడం వీరి ప్రధాన లోపం!
ఎట్టకేలకు ఇన్నేళ్ళ సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ BGT ఆస్ట్రేలియా సిరిస్ ద్వారా NKR రూపంలో టీమ్ ఇండియాకు ఓ మంచి ఆల్‌రౌండర్ దొరకడం.. అదీ కూడా ACA లాంటి క్రికెట్ అసోసియేషన్ నుండి ఎంపిక కావడం విశేషం!
అయితే.. గత రెండు టెస్టుల్లో కొంత Inexperiance కనడుతున్నప్పటికి.. కొత్తవాడైనా మిగతా అనుభవజ్ఞులైన ఆటగాళ్ళకంటే భిన్నంగా అతని ఇంటెంట్.. అప్రోచ్ చాలా పాజిటివ్ గా ఉండడం ఇక్కడ గమనించాలి! ఏదేమైనా లోయర్ ఆర్డర్ లో ఈ మంచి ఆరంభాలను 60-70 లుగా మలచగలిగితే.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గా టీమ్ లో తన ప్లేస్ ను సుస్థిరం చేసుకోవడం ఖాయం! అదే సమయంలో బౌలింగ్ లో మరో ఐదు, పది కిలోమీటర్ల వేగాన్ని పెంచగలిగితే ఈ 21 ఏళ్ల యువ సంచలనానికి తిరుగుండదు!
అయితే ఇక్కడ కావాల్సిందల్లా స్థిరత్వం.. దీర్ఘకాలం తన ఫిట్నెస్ ను కొనసాగించడంతో పాటు ఆన్ ది ఫిల్డ్ ఆఫ్ ది ఫీల్డ్ ఒకేరకమైన టెంపో నీ మెయింటెయిన్ చెయ్యడం! ఈ విషయంలో మాత్రం నితీష్ ఫీల్డ్ లో గేమ్ ను బాగ ఎంజాయ్ చేస్తూ.. చాలా కూల్ గా మెచ్యుర్డ్ గా కనపడుతున్నాడు!
చివరిగా.. ఫాస్ట్ బౌలర్లకు మంచి బౌన్స్ పేస్ దొరికే ఆస్ట్రేలియా లాంటి పిచ్ ల మీద.. ఆ భారీ గ్రౌండ్స్ లో నితీష్ అవలీలగా సిక్సర్లు కొట్టడం చూస్తోంటే.. ఇక్కడ ఇండియా లో ఫ్లాట్ తారు రోడ్డు పిచ్ ల మీద ఆడటం పెద్ద కష్టమేమీ కాదని చెప్పొచ్చు!
- చల్లా శ్రీధర్ రెడ్డి