మహానటి కీర్తి సురేష్ పెళ్లి , ప్రేమించి పెళ్లి పీటలెక్కిన స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడారు. ఆంటోని తెట్టిల్ ను గోవా వేదికగా జరిగిన పెళ్లిలో సంప్రదాయబద్ధంగా మనువాడారు.

కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సినిమాతో ఆమెకు జాతీయ అవార్డ్ కూడా దక్కింది.

తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబు సహా పలువురి సరసన నటించి, మెప్పించింది. అయితే తన చిన్న నాటి స్నేహితుడితో ప్రేమాయణం విషయాన్ని మాత్రం ఇంతకాలంగా గుట్టుగా ఉంచింది.

తనే స్వయంగా తమ ప్రేమ, పెళ్లి వివరాలను మీడియాకు వెల్లడించింది. గోవా కేంద్రంలో తొలుత హిందూ, ఆ తర్వాత క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లాడబోతున్నట్టు తెలిపింది. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. #ForTheLoveOfNyke అంటూ ట్యాగ్ చేర్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *