మీకు 2 రోజుల పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఆగిపోతాయి, ఎవరికి, ఎప్పుడో తెలుసా?
యూపీఐ వ్యవస్థ ఇప్పుడు సర్వజనీనమయిపోయింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకూ అందరూ స్కానర్ ద్వారా పేమెంట్స్ కి ప్రాధాన్యతనిస్తున్నారు. నెలా నెలా పెరుగుతున్న లావాదేవీలతో యూపీఐ పేమెంట్స్ రికార్డుల మోత మోగిస్తోంది.
అయితే తాజాగా బ్యాంకుల నిర్వహణ కోసమంటూ యూపీఐ కార్యకలాపాలు బంద్ చేయబోతున్నారు. రెండు రోజుల పాటు వాటిని నిలిపివేసే అవకాశం ఉంది. నవంబర్ లోనే HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు ఈ సేవలు నిలిపివేయబోతోంది.
తొలుత HDFC అకౌంట్ హోల్డర్లకు రెండు రోజుల పాటు నిలిపివేయబోతున్న ఈ యూపీఐ పేమెంట్స్ తొలుత నవంబర్ 5న, ఆ తర్వాత నవంబర్ 23న అమలు చేస్తున్నారు. ఈ రెండు రోజుల పాటు కస్లమర్లు తమ ఖాతాల నుంచి డబ్బులు పంపించడం, స్వీకరించడం చేయలేరు.
బ్యాంక్ వెబ్సైట్ వెల్లడించిన సమాచారం ప్రకారం కొన్ని ముఖ్యమైన సిస్టమ్ మెయింటెనెన్స్ సెట్టింగ్స్ కారణంగా HDFC బ్యాంక్ ఈ UPI సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పింది. నవంబర్ 5 అర్ధరాత్రి 12.00 గంటల నుంచి 02.00 గంటల వరకు, ఆ తర్వాత నవంబర్ 23న అర్ధరాత్రి 12.00 గంటల నుంచి తెల్లవారుజామున 03.00 గంటల వరకు ఈ యూపీఐ సేవలు నిలిపివేయబడతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలతో పాటు రూపే కార్డ్‌లపై ఆర్థిక, ఆర్థికేతర యూపీఐ లావాదేవీలు చేసుకోవడం సాధ్యం కాదని బ్యాంక్ తెలిపింది. ఇది కాకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ సేవల ద్వారా చెల్లింపులు చేసుకునే దుకాణదారులు కూడా ఈ వ్యవధిలో చెల్లింపు చేసుకోలేరు.
HDFC బ్యాంక్ ఖాతా నుంచి UPIని వినియోగిస్తున్నయితే HDFC బ్యాంక్ మొబైల్ యాప్, Paytm, PhonePe, Google Pay, Mobikwik వంటి వాటి ద్వారా కూడా డబ్బును పంపించడం, తీసుకోవడం సాధ్యం కాదు. ఆ సమయంలో కార్యకలాపాలు నిర్వహించలేరు.