ఇరాన్ మహిళ దుస్తులు విప్పేసింది కారణమేంటి?
ఇరాన్ రాజధాని నగరం తెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ సైన్స్, రీసర్చ్ బ్లాక్-1 దగ్గర ఓ మహిళ అర్థనగ్నంగా కనిపించారు. ఇన్నర్ వేర్ మాత్రమే ధరించిన ఒక అమ్మాయి యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఒక గోడపై కూర్చున్న వీడియో వైరల్ అయ్యింది. ఆమె నిరసన తెలుపుతూ ఇలా ప్రవర్తించిందనే వాదన వినిపించింది. సోషల్ మీడియాలో ఆమెకు మద్ధతుగా పోస్టింగ్స్ కూడా మొదలయ్యాయి.
అయితే తాజాగా ఆమె మానసిక స్థితి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతున్నారు. క్లాస్ రూమ్ లో వీడియో చిత్రీకరణకు ప్రయత్నించిన ఆమెను సహచర విద్యార్థులు అడ్డుకోవడంతో వింతగా ప్రవర్తించడడం మొదలయినట్టుగా చెబుతున్నారు.
అనుమతి లేకుండా క్లాస్ రూమ్ లోకి వచ్చి, అక్కడి వారి వీడియో తీయడం మీద ఆమెను ప్రొఫెసర్ నిలదీశారు. దాంతో పాటుగా ఆమె వ్యవహారశైలి మీద నిఘా ఉంచాలంటూ ఆదేశించారు. దాంతో ఆమె అక్కడే పెద్ద గొడవకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి బయటకు వచ్చి గోడ దగ్గర తన దుస్తులు విప్పేసి సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగినట్టు యూనివర్సిటీ వర్గాల కథనం.
‘‘మానసిక స్థితి సరిగ్గా లేని యువతి తన సహవిద్యార్థులు, ఉపాధ్యాయుల వీడియోలు తీయడం ప్రారంభించారు. దీంతో ఆ యువతిని వారు మందలించారు. విద్యార్థులు, భద్రతా సిబ్బంది హెచ్చరించడంతో ఆమె క్యాంపస్‌లోకి పరుగెత్తి.. ఇదంతా చేశారు’’ అని యూనివర్సిటీ పీఆర్వో అమీర్ మహ్జూబ్ చెప్పారు.
ఇరాన్ కొంతకాలంగా మహిళల మీద నియంత్రణ పెరుగుతోంది. మహిళల స్వేచ్ఛ కోసం వివిధ రూపాల్లో ఆందోళన సాగుతోంది. అదే క్రమంలో ఈ యువతి కూడా నిరసన తెలిపిందనే ప్రచారం జోరుగా సాగుతున్న దశలో ఆమె మానసిక స్థితి మీద సందేహాలు కలిగించేలా యూనివర్సిటీ చేసిన ప్రకటన ఆసక్తిగా మారుతోంది.