పుష్ప2 కోసం స్టార్ క్రికెటర్లు బరిలో దిగుతున్నారా?

అల్లు అర్జున్ రీసెంట్ సెన్సేషన్ పుష్ప2 చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే ప్రచారపర్వంలో ఎక్కడా తగ్గకూడదని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రచారం కోసం భారీ ప్లాన్ వేశారు. దానికి తగ్గట్టుగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం జరుగుతోంది.

వివిధ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈవెంట్స్ ను నిర్వహించే స్కెచ్ వేసింది. నార్త్ ఇండియాలోని అన్ని స్టేట్స్ లో కూడా ఈ ఈవెంట్స్ జరుగనున్నాయి. పంజాబ్ లోని మొహాలీ , రాజస్థాన్ లో జైపూర్ , గుజరాత్ లో గాంధీ నగర్ , ఉత్తరప్రదేశ్ లో లక్నో , మహారాష్ట్ర లో ముంబై , బెంగాల్ లో బీహార్ , మధ్య ప్రదేశ్ లో ఓ ఇన్డోర్ ఈవెంట్ ను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పాట్నా లో జరిగి ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ ఉండబోతుందని సమాచారం. ఆ తర్వాత కలకత్తా లో మరో ఈవెంట్ ను చేయాలనీ రెడీ అవుతున్నారట. దానికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేసినట్లు సమాచారం. ఇక ఈ ఈవెంట్స్ కు స్టార్ క్రికెటర్స్ సూర్యకుమార్ యాదవ్ , రింకు సింగ్ , అర్ష దీప్ సింగ్ సహా పలువురు క్రికెటర్స్ ను ఇన్వైట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

పంజాబ్ ఈవెంట్ కు శిఖర్ ధావన్ , గాంధీ నగర్ లో ఈవెంట్ కు హార్దిక్ పాండ్యా , ముంబై లో ఈవెంట్ కు అజింక్య రహానే , అలాగే అమెరికాలో ఓ ఈవెంట్ ను ఎరేంజ్ చేసి.. అక్కడ గెస్ట్ గా క్రిస్ గేల్ ను ఇన్వైట్ చేయనున్నారట పుష్ప టీం. ఇక ఆస్ట్రేలియాలో జరిగే ఈవెంట్ కు మ్యాక్స్ వెల్ , డేవిడ్ వార్న‌ర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలా పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఈ స్టార్ క్రికెటర్స్ సందడి చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి అదెంత వరకూ పుష్ప2కి ఉపయోగపడుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *