నాగార్జున వియ్యంకుడు దుబాయ్ లో చానా రిచ్!

అఖిల్ అక్కినేని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పటికే ఓసారి జీవీకే మనుమరాలు శ్రేయస్ భూపాల్ తో నిశ్చితార్థం వరకూ వెళ్ళి వెనక్కి తగ్గిన ఈ అక్కినేని చిన్నోడు ఈసారి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన సహచరి జైనబ్ రావుడ్జీతో పెళ్లికి రెడీ అవుతున్నాడు.

జైనబ్ కుటుంబానికి దుబాయ్ లో పెద్ద నెట్ వర్క్ ఉంది. పశ్చిమాసియాలోనే పలుకుబడి కలిగిన బడా బిజినెస్ మేన్ ఆమె తండ్రి. గతంలో ఎనర్జీ సెక్టార్ లో జుల్పీ రావుద్జీ కొన్ని కంపెనీలు నడిపారు. వాన్ పిక్ లో కూడా భాగస్వామి. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. చాలాకాలంగా నాగార్జునకి సన్నిహితుడు.

జుల్ఫీ రావుద్జీ‌ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్. వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు. ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రావుద్జీ‌ హైదరాబాద్ లోని రోడ్ నెంబర్.7, బంజారాహిల్స్ లో నివాసం ఉండేవారు. అప్పుడే నాగార్జున వంటి వారితో స్నేహం. వైఎస్ జగన్ తో పరిచయాలు ఏర్పడినట్టు చెబుతున్నారు.

జుల్ఫీ కుమార్తెను త్వరలోనే అక్కినేని అఖిల్ వివాం చేసుకోబోతుండడం విశేషం. ఈ ఇరువురు నాగార్జున ఇంట్లోనే కొంతకాలంగా కలిసి జీవిస్తుండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *