ఆ పెళ్లి మీద ట్రోలింగ్ ఎందుకు బ్రో..?

సినీ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. అందులో హీరో ప్రభాస్, టీవీ స్టార్లు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్ల పేర్లుంటాయి. చాలాకాలం పాటు వెయిట్ చేసిన సుబ్బరాజు ప్రస్తుతం వాళ్ల లిస్టు నుంచి బయటపడడం విశేషమే.

చాలాకాలంగా తన పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్న సుబ్బరాజు తాజాగా తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ తర్వాత అనేక మంది సుబ్బరాజుని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

47 ఏళ్ల వయసున్న సుబ్బరాజుకి పెళ్లేంటి అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుబ్బరాజు సినిమాల్లో విభిన్న క్యారెక్టర్లు పోషించారు. కామెడీ, విలనీ వంటి పాత్రలు పోషించి టాలీవుడ్ ప్రేక్షకులకు చిరపరిచితుడిగా ఉన్నారు. అలాంటి సుబ్బరాజు మీద ట్రోలింగ్ విస్మయకరం.

వాస్తవానికి పెళ్లి ఎవరిదైనా అది వ్యక్తిగత విషయం. అందులో ఎవరినీ తప్పుబట్టడానికి ఆస్కారం ఉండదు. ఎవరికి ఇప్పుడు నచ్చితే, ఎవరు నచ్చితే వాళ్లు చేసుకుంటారు. వద్దనుకున్నప్పుడు ఒంటరిగా సాగుతారు. పెళ్లి తర్వాత కుదరదు అనుకున్న వాళ్లు విడిపోతుంటారు. అలాంటి వ్యక్తిగత అంశాలను కూడా కొందరు వివాదాస్పదం చేయడం, ఎదుటి వారిని హేళన చేయడం సోషల్ మీడియాలో విపరీత ధోరణిని చాటుతుంది. అలాంటి ప్రయత్నం ఎవరికీ శ్రేయస్కరం కాదు.

సుబ్బరాజు తనకు నచ్చినప్పుడు, నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకుంటే ఆయన మీద పడి ట్రోల్ చేద్దామనంటుకున్న వాళ్లకు పోయేదేముంది. 47 ఏళ్ల వయసులో కాకపోతే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లు మరో పదేళ్లు దాటిన తర్వాత చేసుకుంటారు. దానిలో తప్పుబట్టడానికి ఏముంది. కానీ ట్రోలింగ్ బ్యాచ్ కి ఉచ్చనీచాలు తెలియవు కాబట్టి చేతికొచ్చింది కామెంట్ చేసి దురద తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *