Pushpa2 Review: పుష్ప2 అల్లు అర్జున్ విశ్వరూపమే, రివ్యూ

సినిమా: పుష్ప 2 – ది రూల్‌
యాక్టర్స్: అల్లు అర్జున్‌, ర‌ష్మిక, ఫాహాద్ ఫాజిల్‌, జ‌గ‌ప‌తిబాబు, ధ‌నుంజ‌య‌, రావు ర‌మేష్‌, సునీల్‌, అన‌సూయ‌
సాంగ్స్: చంద్ర‌బోస్‌
యాక్ష‌న్‌: పీట‌ర్ హెయిన్‌, డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కిచ్చా, న‌వ‌కాంత్‌
సినిమాటోగ్ర‌ఫీ: కూబా
ఎడిటింగ్‌: న‌వీన్ నూలీ
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ప్రొడ్యూసర్స్: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి
స్టోరీ, డైరెక్షన్: సుకుమార్ బండ్రెడ్డి

నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ద రైజింగ్ తో నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సీక్వెల్‌గా వ‌స్తోన్న పుష్ప 2 సినిమాపై దేశ‌వ్యాప్తంగా క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు రు. 1060 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. సినిమా రివ్యూ చూద్దాం

స్టోరీ:
పుష్ప 1కు కొన‌సాగింపు విషయమే. పెద్ద మలుపులేమీ ఉండవు. పుష్ప (బ‌న్నీ) త‌న భార్య శ్రీ వ‌ల్లి ( ర‌ష్మిక ) తో కాపురం చేసుకోవ‌డం.. ఈ క్ర‌మంలోనే జ‌స్ట్ త‌న భార్య కోరిక మేర‌కు ఫొటో తీసుకోనివ్వ‌లేద‌ని సీఎంను మార్చేసి ఓ 5 వేల కోట్ల డీల్ కుదుర్చుకుని… ఎంపీగా ఉన్న రావు ర‌మేష్ ను సీఎంను చేస్తాడు. ఈ క్ర‌మంలోనే భ‌న్వ‌ర్‌సింగ్ ( ఫాహాద్ ఫాజిల్‌) తో ఫ‌స్ట్ పార్ట్‌లోనే ఉన్న‌ వైరం మ‌రింత‌గా ఎలా ముదిరింది ? ప్ర‌తాప్‌రెడ్డి (జ‌గ‌ప‌తిబాబు)తో పుష్ప‌కు ఎందుకు వైరం ఏర్ప‌డింది ? లోక‌ల్ స్మ‌గ్ల‌ర్‌గా ఉన్న పుష్ప ఇంట‌ర్నేష‌న‌ల్ డాన్‌గా ఎలా ? ఎదిగాడు ? తొలి భాగంలో త‌న తండ్రి మొద‌టి ఫ్యామిలీకి.. ఆ అన్న‌ద‌మ్ముల‌కు దూరం అయిన పుష్ప వారికి ఎలా ద‌గ్గ‌ర‌య్యాడు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే పుష్ప 2.

ఎనాలిసిస్ :
పుష్ప విశ్లేష‌ణ విష‌యానికి వ‌స్తే ప‌గ‌తో ర‌గిలిపోతోన్న భ‌న్వ‌ర్‌సింగ్ తో స‌వాల్ చేసి మ‌రీ చెప్పిన డేట్‌కు.. చెప్పిన టైంకు చెన్నై బోర్డ‌ర్ దాటించే సీన్ అదిరిపోయింది. సండ్ర దుంగ‌ల‌ను లారీల్లోకి ఎక్కించి త‌ప్పుదోవ ప‌ట్టించి… ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను ఎడ్ల బండ్లుగా మార్చి భ‌న్వ‌ర్‌ను బక‌రాను చేయ‌డం హైలెట్‌. స‌రుకును త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రం నుంచి స‌ముద్రం బోర్డ‌ర్ దాటించేసి శ్రీలంక పంపే సీన్ దంచి కొట్టింది. ఎక్క‌డైనా సినిమా గ్రాఫ్ త‌గ్గుతుందా అనుకుంటోన్న టైం లోనే అదిరిపోయే ఎలివేష‌న్ సీన్‌ వ‌స్తూ ప్రేక్ష‌కుడిని మెస్మ‌రైజ్ చేసేది. అందుకే 200 నిమిషాల సినిమా అయినా మ‌రీ ల్యాగ్ అయిన ఫీలింగ్ రాలేదు. సీఎం పుష్ప‌తో ఫొటో ఇవ్వ‌లేద‌ని స‌వాల్ చేసి చెప్పిన టైంకు సీఎంనే మార్చేయ‌డం కూడా క‌న్విన్సింగ్‌గానే ఉంది. జ‌పాన్ ఫైట‌ర్ల‌తో సినిమా స్టార్టింగ్‌లోనే తీసిన ఫైట్‌లో బ‌న్నీ ఎలివేష‌న్ అయితే అదిరిపోయింది.

సీఎంను క‌లిసేందుకు వెళ్లిన‌ప్పుడు త‌న భార్య శ్రీ వ‌ల్లి కోరిక మేర‌కు సీఎంతో ఓ ఫొటో అడిగితే స్మ‌గ్ల‌ర్ల‌తో ఫొటో ఇవ్వ‌ను అంటాడు… వెంట‌నే ఎంపీగా ఉన్న రావూ ర‌మేష్‌నే సీఎం అయిపోతున్నావు.. అని ఫొటో తీసుకునే ఎలివేష‌న్ సీన్ అదిరిపోయింది. సీఎం సీటు కోసం రావు ర‌మేష్‌ను ఢిల్లీ పంపి… జ‌గ‌ప‌తిబాబుతో ఫోన్లో మాట్లాడిన సీన్ అయితే గూస్‌బంప్స్ తెప్పించేస్తోంది. జ‌స్ట్ ఫోన్ క‌లిపినోడికి రు. 5 కోట్లు… మాట్లాడినందుకు జ‌గ‌ప‌తిబాబుకు రు. 25 కోట్లు ఇవ్వ‌డం పుష్ప గాడి రేంజ్ ఏంటో చూపించింది.

స్మ‌గ్ల‌ర్ల‌తో డీల్ మాట్లాడుతున్న టైంలో తాను వండిన కూరలో పుష్ప‌ ఉప్పు త‌గ్గింద‌నడం.. ర‌ష్మిక అల‌గ‌డం.. వెంట‌నే బ‌న్నీ ఉప్పు పంచాయితీ ఏందిరా అంటూ లోప‌ల‌కు వెళ్ల‌డం… ర‌ష్మిక ఫీలింగ్స్ వ‌స్తున్నాయంటే… ర‌ష్మిక కాలిమీద పుష్ప మార్క్ త‌గ్గేదేలా స్లాగ్ ఇవ్వ‌డం పుష్ప గాడి మార్క్ మేన‌రిజం కొత్త‌గా ఉంది. ఇక ఫీలింగ్స్ సాగంగ్‌లో అయితే డ్యాన్స్ చంపేశాడు. సినిమా స్టార్టింగ్ జ‌పాన్‌లో ఫైట్ నుంచి ఫ‌స్టాఫ్‌లో ప్ర‌తి ప‌ది నిమిషాల‌కు ఓ భ‌యంక‌ర‌మైన ఎలివేష‌న్ షాట్ ప‌డుతూనే వ‌స్తోంది. అది కామెడీ అయినా.. యాక్ష‌న్ అయినా.. బ‌న్నీ గురించి ఎలివేష‌న్ అయినా.. డైలాగులు అయినా కూడా విజిల్స్ మోత మోగిపోయేలా ఉన్నాయి. ఫ్యాన్స్‌కు మాత్ర‌మే కాదు.. స‌గ‌టు సినీ అభిమానికి… మాస్ ఫ్యాన్స్‌కు అయితే విజిల్స్ మోత మోగించేశాడు.

ఫ‌స్టాఫ్‌లో పుష్ప ఎంట్రీ సాంగ్ .. అటు ఫీలింగ్సే సాంగ్ రెండూ మంచి రిలీఫ్‌. క్రేజీ ఫీలింగ్సే సాంగ్‌లో బ‌న్నీ, ర‌ష్మిక ఇద్ద‌రూ పోటీప‌డి ఎన‌ర్జీతో వేసిన స్టెప్పులు కేకో కేక అని చెప్పాలి. ఫ‌స్టాఫ్‌లో ఈల‌లు.. కేక‌ల‌తో థియేట‌ర్లు అంతా మార్మోగితే.. సెకండాఫ్‌లో సెంటిమెంట్ ఎక్కువైంది. సినిమా స్టార్టింగ్ నుంచి కాస్త స్లోగా మూవ్ అవుతున్న కంప్లైంట్ ఉన్నా కూడా బోర్ కొట్ట‌కుండా న‌డిపించ‌డంలో సుకుమార్ స్క్రీన్ ప్లే బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. స్క్రీన్ ప్లే విష‌యంలో సుకుమార్ బాగా క‌స‌ర‌త్తులు చేశాడు. జాత‌ర ఫైట్‌తో పాటు ప్ర‌తాప్‌రెడ్డి కొడుకు… పుష్ప స‌వ‌తి అన్న కూతురును కిడ్నాప్ చేస్తే విడిపించుకునే సీన్లో వ‌చ్చిన ఫైట్‌తోనే సినిమా స్కై రేంజ్‌కు వెళ్లిపోయింది. ఇక శ్రీలీల – బ‌న్నీ కిస్సిక్ సాంగ్ కుమ్మిప‌డేసింది.

ఈ సీక్వెల్‌కు సుకుమార్ కోసం క‌థ‌ప‌రంగా పెద్ద‌గా క‌స‌ర‌త్తులు చేయ‌లేదు. అయితే క‌థ‌నంతో పాటు స్క్రీన్ ప్లే విష‌యంలో చాలా క‌స‌ర‌త్తులు.. జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. ఫ‌స్టాఫ్ అంతా పుష్ప మీద అరివీర భ‌యంక‌ర‌మైన ఎలివేష‌న్ల‌తో సినిమాను న‌డిపిన సుక్కు సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌, డ్రామాకు ప్ర‌యార్టీ ఇచ్చాడు. సెకండాఫ్‌లో రంగ‌స్థ‌లంలా ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా పండించాడు. అంత‌కుముందు వ‌ర‌కు త‌న అన్న కుమార్తెను కాపాడేందుకు ఏకంగా కేంద్ర మంత్రి ప్ర‌తాప్‌రెడ్డి అన్న కుమారుడిని వ‌దిలిన‌ట్టే వ‌దిలి త్రిశూలంతో చంపి పైకి లేపే సీన్ మామూలు అరాచ‌కంగా లేదు.. అరాచ‌కానికే అమ్మ మొగుడ్రా బాబు అన్న‌ట్టుగా ఉంది.

డైలాగుల ప‌రంగా పుష్ప‌ను స‌వతి అన్న అవ‌మానించే క్ర‌మంలో ర‌ష్మిక భావోద్వేగంతో చెప్పిన డైలాగులు.. న‌ట‌న హార్ట్ ట‌చ్చింగ్‌. అత్తా నువ్వు నీ కొడుకును అంటే నువ్వు ఊరుకుంటావేమో కాని.. నా మొగుడ్ని అంటే నేను ఊరుకోను … పుష్ప‌ను ఎలివేట్ చేస్తూ పుష్ప అంటే బ్రాండ్ అని చెప్ప‌డం సూప‌ర్‌. పెళ్లాల‌డిగేదే నూటికో కోటికో ఓ కోరిక‌.. అది కూడా తీర్చ‌ని వాడు మొగుడు ఎట్ట అవుతాడు అమ్మీ లాంటివి మాస్‌కు మెప్పించాయి.

పెర్పామెన్స్ :
బ‌న్నీ యంగ్ ఎన‌ర్జిటిక్ న‌ట‌న‌తో అద‌ర గొట్టేశాడు. పుష్ప 1ను మించి త‌న న‌ట విశ్వ‌రూపం చూపించాడు. ఈ పాత్ర కోసం త‌న‌ను మార్చుకున్న తీరు.. ప్ర‌తి సీన్‌కు డిఫ‌రెండ్ వేరియేష‌న్‌… డైలాగ్ మాడ్యులేష‌న్‌.. ర‌ష్మిక‌తో రొమాన్స్‌… యాక్ష‌న్‌.. డైలాగులు చెప్పిన తీరు… ఎక్స్‌ప్రెష‌న్స్‌… ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు.. స‌రికొత్త స్టెప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే బ‌న్నీ ఇర‌గ‌దీసి ప‌డేశాడు. బ‌న్నీ ర‌గ్ అండ్ ర‌ఫ్ న‌ట‌న న‌భూతోః న‌భ‌విష్య‌త్ అన్న‌ట్టుగా ఉంది. ర‌ష్మిక రొమాన్స్ సీన్ల‌లో అద‌ర‌గొట్టేసింది.. రెండు. మూడు సార్లు ఫీలింగ్స్ వ‌స్తున్నాయంటూ బ‌న్నీ చొక్కా విప్పేయ‌డం మాస్‌.. ఫ్యాన్స్‌తోనే కాదు.. సోపాల్లో ఉన్న క్లాస్ ఫ్యాన్స్‌తోనూ ఈల‌లు వేయించింది. పుష్ప భార్య పాత్ర‌లో ఫ‌స్ట్ పార్ట్ కంటే కూడా ప‌రిణితి ఉన్న పాత్ర‌లో బాగా న‌టించారు.

ఫాహాద్ ఫాజిల్‌కు సారీ చెప్పి ఆవేద‌న‌తో ర‌గిలిపోయి తిరిగి వెన‌క్కి వ‌చ్చి అదే ఫాహాద్‌ను స్విమ్మింగ్ ఫూల్‌లోకి తోసి మ‌రీ అదే నీటిలో యూరిన్ పోసే సీన్‌కు విజిల్స్ మోత ఆగ‌లేదు.. అస‌లు సుకుమార్‌కు వ‌చ్చిన ఈ ఆలోచ‌న మామూలుగా లేదు. పుష్ప గాడు సారి చెపితే ఎలా ఉంటుందో వీరంగం చేసి చూపించాడు. ఫాహాద్ ఫాజిల్‌కు కౌంట‌ర్‌గా ద‌మ్ముంటే ప‌ట్టుకోరా అంటూ తొడ‌చ‌రిచి స‌వాల్ చేయ‌డం సూప‌ర్ కిక్ ఇచ్చింది. స్క్రీన్ ప్లేలో ప్ర‌తి ప‌దినిమిషాల‌కు ఓ హై ఎలిమెంట్ ఉండేలా చేసిన మ్యాజిక్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఫాహాద్ ఫాజిల్ పుష్ప మీద ప‌గ‌తో ర‌గిలిపోయే పాత్ర‌లో బాగా న‌టించాడు. పుష్ప యూరిన్ పోసినా… నీటిలో నానినా.. పుష్ప బ‌ట్ట‌లు విప్పిస్తే అవ‌మానంతో ర‌గిలిపోయినా.. ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ ఫాహాద్‌లో న‌టుడిని మ‌రింత కొత్త‌గా ఆవిష్క‌రింప‌జేశాయి. జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. జ‌గ‌ప‌తిబాబు కంటే ఎంపీగా రావు ర‌మేష్ పాత్ర‌కే మంచి స్కోప్ ఉంది.

మంగ‌ళం శ్రీను భార్య‌గా దాక్షాయిణి పాత్ర‌లో పుష్ప‌పై ప‌గ తీర్చుకునే పాత్ర‌లో అన‌సూయ నెగ‌టివ్ షేడ్స్ పాత్ర‌లో మెప్పించింది. ఈ నెగ‌టివ్ రోల్ ఖ‌చ్చితంగా క్లిక్ అవుతుంది. అన‌సూయ‌కు భ‌విష్య‌త్తులో ఈ త‌ర‌హా నెగ‌టివ్ రోల్స్ ఎక్కువుగా రావ‌డం ఖాయం. ఇక సునీల్ ఫ‌స్టాఫ్‌లో త‌న పాత్ర‌ను కొన‌సాగించినా.. ఎందుకో అన‌సూయ పాత్ర‌తో పోలిస్తే తేలిపోయాడు. ఓ సీన్లో అన‌సూయ నా మొగుడు చేత‌కానోడు అన్న డైలాగ్ సునీల్‌ను ఉద్దేశించి చెపుతుంది.. నిజానికి అన‌సూయ పాత్ర‌తో పోలిస్తే సునీల్ డ‌మ్మీ భ‌ర్త కాదు.. సినిమాలో డ‌మ్మీ అయిపోయాడు.

ప్ల‌స్ పాయింట్స్ :
– అల్లు అర్జున్ విశ్వరూపం
– రాణించిన రశ్మిక
– జాతర సీన్
– ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌

మైన‌స్ పాయింట్స్ :
– రొటీన్ స్టోరీ
– స్టో నేరేషన్

– బీజీఎం ఆశించినంతగా మెప్పించలేకపోవడం
– ర‌న్ టైం

ఫైన‌ల్‌గా…
పుష్ప 2 అల్లు అర్జున్ వీరంగమే అనొచ్చు. సుకుమార్ డైరెక్షన్ లో క‌ళ్లుచెదిరే ఎలివేష‌న్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఓవరాల్ గా సినిమా గ్రాండ్ సక్సెస్ కొట్టేసినట్టే.

‘పుష్ప 2 ‘ రేటింగ్‌: 3.5 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *