వైఎస్సార్సీపీని వీడిన మరో మాజీ మంత్రి!ఆయన కూడా అటే!!
![](https://teluguheadlines.com/wp-content/uploads/2024/12/Avanthi-Srinivasa-Rao.webp)
![](https://teluguheadlines.com/wp-content/uploads/2024/12/20373cd8-64b7-418d-bdb4-ea09afd1b1f5-768x1024.jpg)
2014లో టీడీపీ తరుపున ఎంపీగా గెలిచిన ఆయన 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరి భీమిలి నుంచి గెలిచారు. 2009లోనూ పీఆర్పీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 నుంచి 2022 వరకూ జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. గంట- అరగంట అంటూ ఆయన మీద తీవ్ర దుమారం రేగింది. 2024లో ఓటమి తర్వాత వైఎస్సార్సీపీకి దూరమయ్యారు.
మొన్నటి ఎన్నికల్లో ఆయన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జనసేనలో చేరాలని ఆయన ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటి వరకూ జనసేన అధినేత నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ఆయన అంగీకరించగానే పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా వైఎస్సార్సీపీని వీడినట్టు సమాచారం.
ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను వంటి నేతలు జనసేన కండవాలు కప్పుకున్నారు. అదే క్రమంలో మరో కాపు నేత కూడా జనసేన గూటికి చేరాలని యత్నిస్తుండడం విశేషం.