రాజ్యసభ రేసులో చింతకాయల విజయ్! 4దశాబ్దాల ప్రస్థానానికి ప్రతిఫలమా?
17 ఏళ్ల నిరీక్షణ…
కష్టకాలంలో పరీక్షించబడిన నిబద్ధత…
కుటుంబం మొత్తం తట్టుకున్న రాజకీయ ఒత్తిళ్లు…
ఉత్తరాంధ్ర బీసీ స్వరానికి గుర్తింపు దక్కాల్సిన సమయం వచ్చిందనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది !
1983 నుంచి తెలుగుదేశం పార్టీతో కుటుంబ అనుబంధం కొనసాగిస్తూ… అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా నిలబడిన నాయకత్వం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి రాజకీయ ప్రయాణమే చింతకాయల విజయ్‌ది !!

రాజకీయంగా ఒత్తిళ్లు, కేసులు, దాడులు… కుటుంబంపై మానసిక భయాందోళనలు సృష్టించే పరిస్థితులు వచ్చినా ఎక్కడా రాజీ పడకుండా పార్టీకి అండగా నిలిచిన విధానం ఆయన కుటుంబం రాజకీయ నిబద్ధతను చూపించింది. చిన్న పిల్లలు సైతం ఆ ఒత్తిడులను అనుభవించిన పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకుండా పోరాడటం సాధారణ విషయం కాదు !
ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమీకరణాలు, బీసీ సామాజిక వర్గ ప్రాధాన్యత నేపథ్యంలో ఇప్పుడు ఆయన పేరు రాజ్యసభ రేసులో ముందంజలో వినిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది కేవలం ఒక వ్యక్తి అవకాశంగా కాకుండా… ఎన్నోఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన బీసీ నాయకత్వానికి గుర్తింపుగా కూడా చాలామంది చూస్తున్నారు !
జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి, ఆధునిక ఆలోచనలతో రాజకీయాల్లో ముందుకు వస్తూనే… మరోవైపు క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రతిపక్ష కాలంలో నారా లోకేష్ టీంలో పనిచేస్తూ చూపిన కమిట్మెంట్, కష్టకాలంలో కూడా తగ్గని ఆత్మస్థైర్యం ఇప్పుడు ఆయనకు ప్లస్ అవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది !
పదవులు అనేవి కేవలం రాజకీయ సమీకరణాల ఫలితం మాత్రమే కాదు…
కొన్నిసార్లు అవి నిబద్ధతకు, సహనానికి, దీర్ఘకాల పోరాటానికి దక్కే గుర్తింపు కూడా అవుతాయి !
ఆ కోణంలో చూస్తే…
చింతకాయల విజయ్ పేరు చర్చలో ఉండటం వెనుక ఒక పెద్ద రాజకీయ ప్రయాణం ఉంది !!