రాజకీయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్!
వర్తమాన ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం పడని రంగం లేదు. ఇప్పటికే గూగుల వంటి సంస్థలు కూడా తమ సిబ్బందిలో 10 శాతం మందిని ఇంటికి సాగనంపబోతున్నట్టు ప్రకటించేశాయి. అదంతా ఏఐ ప్రభావమేనని చెబుతున్నాయి.
అదే సమయంలో రాజకీయ నేతలు కూడా ఏఐ వాడకం విస్తృతం చేస్తున్నారు. ప్రచారానికి దానిని విరివిగా వాడే ప్రయత్నంలో ఉన్నారు. కృత్రిమ మేథ సహాయంలో మరణించిన వారందరి ఆశీస్సులు తమకే ఉన్నాయని చాటేందుకు తగ్గట్టుగా వీడియోలు, ఫోటోలు ప్రచారంలో పెడుతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులను ఎండగట్టేందుకు కూడా ఏఐ తోడ్పాడు అందుకుంటున్నారు.
ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో ఏఐ వీడియోల పాత్ర పెరుగుతోంది. తాజాగా దిల్లీ ఎన్నికల్లో ఆప్ మరో అడుగు ముందుకేసింది. దాని ప్రభావంతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ప్రభావం తగ్గడంతో పాటుగా ఏఐ వీడియోల కారణంగా ఆర్టిస్టులకు కూడా పని తగ్గుతుందన్న ఆందోళన ఉంది.
మరోవైపు ఈ ఏఐ ప్రచారానికి ఆకర్షితులవుతున్న తరుణంలో వాడకం మరింత పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది. ఉదాహరణకు పార్లమెంట్ లో అంబేడ్కర్ గురించి చర్చ రాగానే కేజ్రీవాల్ వంటి వారు అంబేడ్కర్ ఆశీస్సులు తీసుకుంటున్న వీడియోను ఆప్ విడుదల చేసింది. దానికి పెద్ద సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఇదే పరంపరం మరింత విస్తృతం కావడం ఖాయంగా భావిస్తున్నారు.
అయితే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో ప్రచార సామాగ్రి సిద్ధం చేసుకున్నంత వరకూ ఫర్వాలేదు గానీ రాజకీయాలు కూడా ఆర్టిఫీషియల్ గా మారిస్తే మాత్రం ఎదురుదెబ్బలు తప్పవన్న వాదన కూడా ఉంది. ఏమయినా వర్తమానంలో అందరినీ ఆకట్టుకుంటున్నట్టుగానే రాజకీయ నేతలను కూడా ఏఐ ఆవరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.