మూడు ఎంపీ సీట్లు ఏకగ్రీవం, 6 నెలల తర్వాత మళ్లీ రాజ్యసభకు టీడీపీ ఎంపీ!
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు సీట్లు కూటమి ఖాతాలో చేరాయి. ఇద్దరు టీడీపీ తరుపున, ఒకరు బీజేపీ తరుపున బరిలో నిలవడంతో వారి ఎన్నికకు మార్గం సుగమమయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావు,సానా సతీష్ బాబు,బిజెపి తరుపువ ఆర్.కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు.మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా…