పులివెందుల ఫలితాల వెనుక అసలేం జరిగింది? ఓటర్ల మనోగతమేంటి? Exclusive Ground Report

“Public opinion is everything. With public sentiment, nothing can fail; without it nothing can succeed.” ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని అంతా అంగీకరిస్తారు. కానీ జనాభిప్రాయానికి విలువనివ్వకపోతే ఏమీ సాధించలేమన్న అబ్రహం లింకన్ చెప్పిన మాటలను అధికారం దక్కగానే విస్మరిస్తారు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రత్యేకమైనవి. ఏడాది పాలనకి గడువు ఉండగా నిర్వహించిన చిన్న ఎన్నికే అయినప్పటికీ దాని…

Read More
modi strategy

పాకిస్తాన్ కి అదే బలం! మోదీ అంచనా అందుకే తప్పిందా?

ఒక్కో దేశానికి ఒక్కో బలం ఉంటుంది. పాకిస్తాన్ బలం మాత్రం భౌగోళిక స్వరూపమే. అందులోనూ కీలక దేశాలకు నడుమ ఉండడమే. ఓవైపు ఇండియా, రెండోవైపు చైనా, ఇంకో వైపు ఇరాన్, వాటికి తోడు పూర్వపు సోవియట్ రష్యా కూడా సమీపంలోనే ఉండేది. కనుకనే అమెరికా కన్నేసింది. పాకిస్తాన్ ను ఉపయోగించుకుంది. రష్యాని బెదిరించేందుకు, ఇండియాను కట్టడిచేసేందుకు పాకిస్తాన్ ను వినియోగించుకుది. చివరకు ఇరాన్, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య పాలకులను గద్దెదించేందుకు పాకిస్తాన్ కేంద్రంగానే పావులు కదిపింది….

Read More
pawan kalyan serious on varma

పిఠాపురం వర్మ మీద వేటు తప్పదా, పవన్ కళ్యాణ్‌ తో వివాదానికి ప్రతిఫలం చెల్లించాల్సిందేనా?

నేరుగా కాకున్నా.. పరోక్షంగానైనా పిఠాపురం వర్మ.. జనసేనానితో యుద్దానికి కాలు దువ్వుతున్నట్టే కన్పిస్తోంది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే రకమైన డౌట్లు వస్తున్నాయి. పిఠాపురం సెగ్మెంట్లో వర్మకు బలం ఉంటే ఉండొచ్చు.. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ పవన్ కల్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో.. అది కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ అధినేతతో నేరుగా యుద్దానికి దిగేటంతటి రేంజీకి పరిస్థితిని తెచ్చుకోవడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బందని…

Read More

ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

ప్రపంచం బాధను తన బాధగా భావిస్తారని శ్రీ శ్రీ గురించి.. తన బాధను ప్రపంచం బాధగా చూస్తారని కృష్ణశాస్త్రి గురించి సాహితీ లోకంలో ఉన్న టాక్. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరుల్లో కొందరు శ్రీ శ్రీలు, ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయినట్టే కన్పిస్తోంది. జీవీ రెడ్డి-దినేష్ కుమార్ ఎపిసోడులో కొందరు శ్రీ శ్రీలుగా మారిపోయారు.. ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయారు. ఎవరి అభిప్రాయాలను వారు చెప్పేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా చంద్రబాబు కంటే జీవీ రెడ్డే గ్రేట్ అనే స్థాయిలో కామెంట్లు కూడా…

Read More

విజయసాయిరెడ్డి తీరు విడ్డూరంగా ఉందా, వ్యవహారం తేడాగా ఉందా?

వైఎస్సార్సీపీని కీలక నేతలు వీడుతుంటే టీడీపీ సంతోషపడాలి. ప్రత్యర్థి బలహీనపడుతున్నాడని ఆనందించాలి. కానీ ఇప్పుడు పాలక టీడీపీలో కలవరం కనిపిస్తోంది. తాజా పరిణామాల మర్మం తెలియక ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆఖరికి టీడీపీ అధినేత కూడా విజయసాయిరెడ్డి రాజీనామా మీద ముక్తసరిగా మాట్లాడి సరిపెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు విజయసాయి రెడ్డి మీద విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇదంతా ఆసక్తికర అంశం. వాస్తవానికి టీడీపీ నేతలు సందేహించడానికి తగ్గట్టుగానే సాయిరెడ్డి…

Read More

విజయసాయిరెడ్డి కరెక్ట్ ఆప్షన్ ఎంచుకున్నారా?

వైఎస్సార్సీపీని వీడిపోయిన విజయసాయిరెడ్డి రేపోమాపో కాషాయ కండువా కప్పుకుంటారు. అది తక్షణమే జరుగుతుందా, కొన్ని నెలల తర్వాత జరుగుతుందా అన్నదే ప్రశ్న. నేరుగా వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరితే తన అభిమానులు జీర్ణించుకునే అవకాశం లేదు కాబట్టి కొంత విరామం తీసుకుని ఆయన మళ్లీ బీజేపీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీని వీడడం ద్వారా ఆపార్టీ కంటే వ్యక్తిగతంగా జగన్ ఎక్కువ నష్టపోతారనడం కూడా నిస్సందేహం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుట్టంతా…

Read More

జగనూ, పవనూ ఇద్దరికీ పాఠం చెప్పిన సినిమా రాజకీయాలు!

రాజకీయ పార్టీ లేదా సినిమా ఏదైనా గానీ ఒక కులం, ఒక వర్గం ఆధారంగా సక్సెస్ కొట్టలేవన్నది జగమెరిగిన సత్యం. కానీ ఆయా కులాల అండదండలతో కొంత ఊపు వస్తుంది. పార్టీకయితే పునాది అవుతుంది. సినిమాకయితే ఒకటి రెండు రోజుల వసూళ్లుంటాయి. అంతకుమించి కులాన్ని నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొణిదెల పవన్ కళ్యాణ్ కి అర్థమయ్యి ఉండాలి. ఎందుకుంటే కులం కారణంగా రాజకీయాల్లో ఒకరు, సినిమాల్లో ఒకరు దెబ్బతినాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్…

Read More

ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?

ఆంధ్రప్రదేశ్‌ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు. అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు…

Read More

రాధాకృష్ణ అసలు బాధేంటి? నిజంగా బాబుకి పాలన మీద పట్టు చిక్కడం లేదా?

చంద్రబాబు పాలనలో ఏమీ బాలేదా..చంద్రబాబు రాజకీయాలు చేయలేకపోతున్నారా..వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌ పోటీ పడితే నారా లోకేశ్ వాళ్లను ఎదుర్కోలేరామర్రి చెట్టు కింద మొక్కలా లోకేశ్ మిగిలిపోతున్నారాఅసలెందుకిలా ఏబీఎన్ ఎండీ మండిపడే పరిస్థితి వచ్చింది. ఆసక్తికరమైన రాతలతో రాధాకృష్ణ తీరు చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన అనేక కథనాలు ప్రస్తావించడం, ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు దాని మాటే మరచిపోవడం ఆనవాయితీ. ఆ మధ్య సానా ముదురు అంటూ ఎంపీ సానా సతీశ్ గురించి…

Read More

అచ్చెన్నాయుడి సోదరుడైతే రిటైర్మెంట్ తర్వాత కూడా పోస్టింగ్!

ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథనం వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత బుడితి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి సర్వీస్ పొడిగింపునకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి బాబాయ్ అయిన కింజరాపు ప్రభాకర్ కి రిటైర్మెంట్ తర్వాత ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దాని మీద ఏమంటుందో మరి జ్యోతి. జ్యోతి రాతలు పక్కన పెడితే రాష్ట్రంలో…

Read More