జమిలీ ఎన్నికలకు రెడీ అవుతున్న వైఎస్సార్సీపీ, టీడీపీ అధిష్టానం కూడా సిద్ఢమా?

ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు తప్పవన్న అంచనాకు రాజకీయ పార్టీలు వచ్చేశాయి. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంటూ మోదీ పదే పదే చెబుతుండడంతో పరిణామాలు అనివార్యంగా భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా జమిలీ ఎన్నికలంటూ తమ క్యాడర్ కి పిలుపునిచ్చారు. మరో రెండేళ్లలో ఎన్నికలు అనివార్యమంటూ చెబుతున్నారు. రాబోయే ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని సూచిస్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగిసి ఇంకా ఆరు నెలలు కూడా గడవకముందే అప్పుడే…

Read More

ఉచిత బస్సుపై నీలినీడలు..పొరుగున సంకేతాలు ఏమిటి?

ఎన్నికల్లో ఓటరు తీర్పును స్థానిక పరిస్థితులే కాకుండా పొరుగున జరిగే సంఘటనలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. దక్షణాది రాష్ట్రాలకు ఈ వాక్యం కచ్చితంగా సరిపోతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 6 ఫార్ములాను తీసుకువచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తమ మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని జాతీయ నాయకులు నుంచి రాష్ట్ర నాయకులు వరకు ప్రగల్భాలు పలికారు.2023 మే లో జరిగిన…

Read More

అప్పుగా కాదు…కేంద్ర గ్రాంట్ గా నిధులు ప్రకటించాలి : సి.హెచ్ బాబురావు

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు కోరారు. శనివారం తుళ్లూరులో సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై మళ్ళీ అనిశ్చిత పరిస్థితి తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా,పటిష్టంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగినందున…

Read More

చంద్రబాబు ప్లాన్డ్ గానే ఉన్నారు.. జగన్ కు ఇబ్బందులు తప్పవా..?

ఏపీలో కూడా జమిలీ ఎన్నికలు తప్పవా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రకటిస్తున్న వేళ ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు తప్పవనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీకి పూర్తి ఆయుష్షు కష్టమనే అభిప్రాయం బలపడుతోంది. మధ్యంతర ఎన్నికలు వస్తే అవి ఎప్పుడా అన్న చర్చ కూడా సాగుతోంది. 2027లోనే యూపీ ఎన్నికలతో పాటుగా ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమయితే ఏపీ కూడా…

Read More

జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర : రాచమల్లు

నందమూరి కుటుంబంలో జరిగినవే కారు ప్రమాదాలా? వైయస్ విజయమ్మ తన ప్రయాణంలో కారు టైర్లు ఉడిపోతే జగన్మోహన్ రెడ్డినే హత్య కు కుట్ర చేశారని ఆరోపణలు చేస్తారా? నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన ప్రయత్నం టీడిపి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వైయస్ఆర్ కడప జిల్లాలోని తన నివాసం నుంచి ఒక వీడియో విడుదల చేశారు….

Read More

ఆడబిడ్డల భద్రతకు ఒక్క చట్టమైనా తెచ్చారా? : రోజా

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కక్షతో దిశా పోలీస్ స్టేషన్ లను నిర్వీర్యం చేయడం తప్ప..ఆడపిల్లల భద్రత కోసం ఒక్క చట్టమైన తీసుకువచ్చారా? హోం మంత్రి ఎక్కడ ఉన్నారు? నేరస్థులకు ఎందుకు భయాన్ని కల్పించలేకపోతున్నారు అని ప్రశ్నించారు. శనివారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరిలో మూడేళ్ల పాపపై అత్యాచారం చేసి…

Read More

వైయస్ షర్మిలకు భద్రత అవసరమా ? : కాకాని గోవర్ధన్

మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకొని వై. యస్. షర్మిలకు తాము భద్రత కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.శనివారం నెల్లూరు లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందాకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్…

Read More

ఆడబిడ్డల భద్రతే మొదటి ప్రాధాన్యం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయినట్లు వైసీపీ నాయకులు,వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా…

Read More

ఈదుపురంలో దీపం పథకంకు శ్రీకారం

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.O పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఆయన హెలికాప్టర్లో ఈదుపురం చేరుకున్నారు. అక్కడ సుమారు అరగంట పైన సీనియర్ నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఈదుపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్యాస్ సిలిండర్ల వాహనాలకు జెండా ఊపి, కార్యక్రమాన్ని లాంఛనంగా…

Read More