భగవద్గీత అమ్మకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే
గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు చర్చనీయాంశమవుతోంది. ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలను అమ్ముతుండగా ఆమె అడ్డుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఇస్కాన్ పేరుతో కొందరు భగవద్గీత అమ్మకాల పేరుతో వీధి వీధి తిరుగుతుండగా గుంటూరులో వారు ఎమ్మెల్యే కంటబట్టారు. వారిని నిలదీసిన గల్లా మాధవి వారిని నిలదీశారు. భగవద్గీత పుస్తకాలు అమ్మే అధికారం మీకు ఎక్కడిదీ అంటూ ప్రశ్నించారు. దాంతో ఆమె తీరు మీద ఇస్కాన్ ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది.
గుంటూరు వెస్ట్ నుంచి ఆమె తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి విడదల రజనీ మీద ఆమె గెలిచారు. ఆమె భర్త ఇప్పటికే పలు వివాదాల్లో తలదూర్చారు. రియల్ ఎస్టేట్ లో ఉన్న ఆమె భర్త భూ వివాదంలో నేరుగా ఏపీ సీఎం నుంచి చీవాట్లు తినాల్సి వచ్చింది. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే భగవద్గీత విషయంలో ఇస్కాను ప్రతినిధులను నిలదీసిన తీరు వివాదాస్పదమవుతోంది.
ఎమ్మెల్యే తీరు మీద ఇస్కాన్ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భగవద్గీత అమ్మకాలకు పర్మిషన్ ఏంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలో యూపీ నుండి ఇస్కాన్ వేషధారణలో వచ్చిన కొందరు యువకులు ట్రాఫిక్ కి అసౌకర్యం కలిగిస్తుంటే అడ్డుకున్నామని ఆమె వెల్లడించారు. స్థానిక ఇస్కాన్ మరియు అక్షయపాత్ర వారికి అలానే పోలీసు ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా రోడ్లు పై ట్రాఫిక్ కి అసౌకర్యం కలిగిస్తూ భగవద్గీత పుస్తకాలను విక్రయించడం తగదని చెప్పామన్నారు. వారితో మాట్లాడి అలా రోడ్లపై కాకుండా మున్సిపల్ అధికారుల వద్ద అనుమతి తీసుకొని స్టాల్స్ ఏర్పాటు చేసుకొని అమ్ముకోవాల్సిందిగా సూచించినట్టు గళ్ళా మాధవి పేర్కొన్నారు.