ఉపాధ్యాయుల ఒత్తిడికి తలొగ్గిన నారా లోకేశ్

ఏపీ విద్యాశాఖ మంత్రి వెనకడుగు వేశారు. ఓవైపు ఉపాధ్యాయులు, మరోవైపు సంఘాలు ఒత్తిడి తీసుకురావడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. హైస్కూళ్ల సమయాలు మార్చాలన్న నిర్ణయం మార్చుకున్నారు. దాంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. డిసెంబరు 2 నుంచి పాఠశాలల వేళలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అమలుచేసేందుకు పూనుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పాఠశాలలు…

Read More

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ

ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్‌ ఆ తర్వాత సినిమాల…

Read More

వైయస్ షర్మిలకు భద్రత అవసరమా ? : కాకాని గోవర్ధన్

మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకొని వై. యస్. షర్మిలకు తాము భద్రత కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.శనివారం నెల్లూరు లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందాకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్…

Read More

బాలినేనికి మరో ఎదురుదెబ్బ, మాజీ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జనసేన

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన నాటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే. తాజాగా మరోసారి ఆశాభంగమయ్యింది. తొలుత ఆయన ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరాలని ఆశించారు. కానీ ఆపార్టీ అధిష్టానం అందుకు భిన్నంగా ఆలోచించింది. కనీసం బాలినేని అనుచరులను కూడా వెంట తీసుకురాకుండా ఆయనతో పాటు అతి కొద్దిమందికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అయినా సర్థుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని భారీ సభ…

Read More

జగన్ ఇల్లు ప్యాలెస్ అయితే చంద్రబాబుది నివాసం మాత్రమే ఎలా అయ్యింది?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని సీఎం ఇల్లు అనే అంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి ఇంటిని మాత్రం తాడేపల్లి ప్యాలెస్ అంటారు. నిజానికి చెప్పాలంటే సీఎం చంద్రబాబు నివశిస్తోంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడం. ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్న నదీ గర్భంలో ఉన్న భవనం. అయినా దానిని జనం అంగీకరించేలా చేయడం సాధారణ నైపుణ్యం కాదు. అది నేరం కాదని జనాలను నమ్మించడం చిన్న విషయం కాదు. హైకోర్టు నోటీసులు ఇచ్చిన భవనంలో…

Read More

రాధాకృష్ణ అసలు బాధేంటి? నిజంగా బాబుకి పాలన మీద పట్టు చిక్కడం లేదా?

చంద్రబాబు పాలనలో ఏమీ బాలేదా..చంద్రబాబు రాజకీయాలు చేయలేకపోతున్నారా..వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌ పోటీ పడితే నారా లోకేశ్ వాళ్లను ఎదుర్కోలేరామర్రి చెట్టు కింద మొక్కలా లోకేశ్ మిగిలిపోతున్నారాఅసలెందుకిలా ఏబీఎన్ ఎండీ మండిపడే పరిస్థితి వచ్చింది. ఆసక్తికరమైన రాతలతో రాధాకృష్ణ తీరు చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన అనేక కథనాలు ప్రస్తావించడం, ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు దాని మాటే మరచిపోవడం ఆనవాయితీ. ఆ మధ్య సానా ముదురు అంటూ ఎంపీ సానా సతీశ్ గురించి…

Read More

కేంద్రం నుంచి అనుమతులు వస్తే విశాఖ మెట్రో!

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక‌(సీఎంపి) సిద్దం చేశామని ఏపీ పట్టణాభివృద్ధి , మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్ర‌శ్నోత్త‌రాల్లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై ప్రశ్నకు ఆయన స‌మాధానమిచ్చారు. “ప్ర‌ణాళిక‌ను ఇప్ప‌టికే కేంద్ర‌ప్ర‌భుత్వానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ ప‌నులు ప్రారంభిస్తాం. గ‌త ప్ర‌భుత్వం విశాఖ‌,విజ‌య‌వాడ‌కు మెట్రో రైల్ రాకుండా క‌క్ష‌పూరితంగా ప‌క్క‌న పెట్టేసింది. విశాఖ‌లో భోగాపురం ఎయిర్…

Read More

డ్యుయెల్ రోల్స్ చేయడానికి ఇది సినిమా కాదు పవన్..!

కొన్ని సినిమాల్లో హీరో , విలన్ ఒకడే ఉంటారు. హీరో, విలన్ మాత్రమే కాదు..కమెడియన్ పాత్ర సైతం తనే పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది నిజజీవితంలో సాధ్యం కాదు. రాజకీయాల్లోనూ అసాధ్యం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ తీరు చూస్తుంటే అటు అధికారంలో భాగం పంచుకుంటూ, ఇటు విపక్షంగా గొంతు వినిపించాలన్న వ్యూహంలో ఏమైనా ఉన్నారా అన్న సందేహం కలుగుతోంది. ఏపీలో ఎవరికి నచ్చినా నచ్చకున్నా బలమైన ప్రతిపక్షం ఉంది. సీట్ల పరంగా అది ప్రస్ఫుటించకపోవచ్చు…

Read More

మహానటి కీర్తి సురేష్ పెళ్లి , ప్రేమించి పెళ్లి పీటలెక్కిన స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడారు. ఆంటోని తెట్టిల్ ను గోవా వేదికగా జరిగిన పెళ్లిలో సంప్రదాయబద్ధంగా మనువాడారు. కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సినిమాతో ఆమెకు జాతీయ అవార్డ్ కూడా దక్కింది. తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబు సహా పలువురి సరసన నటించి, మెప్పించింది. అయితే తన చిన్న నాటి స్నేహితుడితో ప్రేమాయణం విషయాన్ని…

Read More