రాహుల్ గాంధీకి వర్తించని నిభందన…మీకు ఎలా సాధ్యం జగన్ ?

ప్రభుత్వ విధానాలను చర్చిండానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి గొప్ప వేదికలు చట్ట సభలు.అలాంటి ప్రజాస్వామ్య అవకాశం అందరికి దొరుకుతుందా? రాజ్యంగ బద్ధ సంస్థ ద్వారా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శాసనసభ్యలు ఆ విషయాన్నే మర్చిపోయారా? ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు అసెంబ్లీ ఎందుకు అని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తున్నారు? పార్టీ కార్యాలయం నుంచే పాలక పార్టీ ని ప్రశ్నిస్తూ ఉంటాము అని ప్రకటిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధికార ప్రతినిధి వరకు…

Read More

డ్యుయెల్ రోల్స్ చేయడానికి ఇది సినిమా కాదు పవన్..!

కొన్ని సినిమాల్లో హీరో , విలన్ ఒకడే ఉంటారు. హీరో, విలన్ మాత్రమే కాదు..కమెడియన్ పాత్ర సైతం తనే పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది నిజజీవితంలో సాధ్యం కాదు. రాజకీయాల్లోనూ అసాధ్యం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ తీరు చూస్తుంటే అటు అధికారంలో భాగం పంచుకుంటూ, ఇటు విపక్షంగా గొంతు వినిపించాలన్న వ్యూహంలో ఏమైనా ఉన్నారా అన్న సందేహం కలుగుతోంది. ఏపీలో ఎవరికి నచ్చినా నచ్చకున్నా బలమైన ప్రతిపక్షం ఉంది. సీట్ల పరంగా అది ప్రస్ఫుటించకపోవచ్చు…

Read More

బాలినేని బల ప్రదర్శనకు అడ్డంకులు ఏమిటి ?

బహిరంగ వేదికలపై టీడిపి, జనసేన నాయకుల కోట్లాటలు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు తల నొప్పిగా మారాయి. ఇలాంటి ఘటనల వలన… వలస నేతలను చేర్చుకునేందుకు టిడిపి జనసేనలు భయపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో మొదలయిన ఈ అసంతృప్త జ్వాలలు అన్నీ నియోజకవర్గాలకు విస్తరించాయి. ఒంగోలు, దెందులూరు, నెల్లిమర్ల,పిఠాపురం నియోజకవర్గాల బాటలో చాలా నియోజకవర్గాలు చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరి దాదాపు 50 రోజులు పైనే…

Read More

యురేనియం తవ్వకాలపై పవన్ వైఖరి మారిందా?

ప్రతిపక్ష నాయకులు చేసే పోరాటం ఆ కాలానికే సరిపోతుందా? వారు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించలేరా? నేడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు గతంలో చెప్పిన మాట ఏమిటి ? నేడు చేస్తుంది ఏమిటి? యురేనియం తవ్వకాలను ఆపాలి.. నల్లమల అడవులను రక్షించాలని నాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి లు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇది తెలుగు వారి సమస్యని రాష్ట్రాలను పక్కన పెట్టీ…

Read More

ఉచిత బస్సుపై నీలినీడలు..పొరుగున సంకేతాలు ఏమిటి?

ఎన్నికల్లో ఓటరు తీర్పును స్థానిక పరిస్థితులే కాకుండా పొరుగున జరిగే సంఘటనలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. దక్షణాది రాష్ట్రాలకు ఈ వాక్యం కచ్చితంగా సరిపోతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 6 ఫార్ములాను తీసుకువచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తమ మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని జాతీయ నాయకులు నుంచి రాష్ట్ర నాయకులు వరకు ప్రగల్భాలు పలికారు.2023 మే లో జరిగిన…

Read More

అప్పుగా కాదు…కేంద్ర గ్రాంట్ గా నిధులు ప్రకటించాలి : సి.హెచ్ బాబురావు

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు కోరారు. శనివారం తుళ్లూరులో సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై మళ్ళీ అనిశ్చిత పరిస్థితి తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా,పటిష్టంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగినందున…

Read More

జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర : రాచమల్లు

నందమూరి కుటుంబంలో జరిగినవే కారు ప్రమాదాలా? వైయస్ విజయమ్మ తన ప్రయాణంలో కారు టైర్లు ఉడిపోతే జగన్మోహన్ రెడ్డినే హత్య కు కుట్ర చేశారని ఆరోపణలు చేస్తారా? నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన ప్రయత్నం టీడిపి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వైయస్ఆర్ కడప జిల్లాలోని తన నివాసం నుంచి ఒక వీడియో విడుదల చేశారు….

Read More

ఆడబిడ్డల భద్రతకు ఒక్క చట్టమైనా తెచ్చారా? : రోజా

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కక్షతో దిశా పోలీస్ స్టేషన్ లను నిర్వీర్యం చేయడం తప్ప..ఆడపిల్లల భద్రత కోసం ఒక్క చట్టమైన తీసుకువచ్చారా? హోం మంత్రి ఎక్కడ ఉన్నారు? నేరస్థులకు ఎందుకు భయాన్ని కల్పించలేకపోతున్నారు అని ప్రశ్నించారు. శనివారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరిలో మూడేళ్ల పాపపై అత్యాచారం చేసి…

Read More

వైయస్ షర్మిలకు భద్రత అవసరమా ? : కాకాని గోవర్ధన్

మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకొని వై. యస్. షర్మిలకు తాము భద్రత కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.శనివారం నెల్లూరు లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందాకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్…

Read More