జమిలీ ఖాయమే కానీ, ఇప్పుడే కాదంటున్న చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమిలీ ఎన్నికలు జరగబోతున్నట్టు పరోక్షంగా అంగీకరించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్ ఛాట్ గా మాట్లాడిన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు. 2027లోనే ఎన్నికలు ఖాయమంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ వైసీపీ పబ్బం…

Read More

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్! చంద్రబాబు మళ్లీ వెనక్కి మళ్లుతున్నారా?

చంద్రబాబు పదే పదే టెక్నాలజీకి సంబంధించిన పదాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం ఆశ్చర్యం ఏమీ కాదు. దశాబ్దాలుగా ఆయన పాలనా విధానంలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఆనాటికి టెక్ ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలను ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. అందరికీ గుర్తుండే ఉంటుంది..2019 కి పూర్వం ఆయన పదే పదే లాజిస్టిక్స్ హబ్ అంటూ చెప్పుకొచ్చేవారు. విశాఖను లాజిస్టిక్స్ హబ్ గా చేస్తానని కూడా ఆయన అన్నారు. మరి ఇప్పుడెందుకు ఆయన మాట మరచిపోయారు. ఇప్పుడెందుకు డీప్…

Read More

కాకినాడ: అప్పుడు డీప్ వాటర్ పోర్టు, ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ బలి చేస్తున్నారా?

కాకినాడ పోర్ట్ వ్యవహారం పెను దుమారం దిశగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ రాజేసిన వివాదం ఇప్పట్లో సర్థుమణిగేలా లేదు. దానికి కారణం ఏకంగా కాకినాడలో సుదీర్ఘ చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్ట్ మీద ప్రభుత్వం కన్నేసిందన్న ప్రచారమే. ఏకంగా యాంకరేజ్ పోర్ట్ మూతవేసే దిశలో ఉందంటూ వస్తున్న కథనాలే అందుకు కారణంగా కనిపిస్తోంది. కాకినాడ తీరం కొంత భిన్నంగా ఉంటుంది. కాకినాడ పోర్టుకి ఎదురుగా బంగాళాఖాతంలో హోప్ ఐలాండ్ ఏర్పడడం,…

Read More

రేషన్ అక్రమరవాణాకు మూలం అవేనట..మాఫియా నియంత్రణ కష్టమట!

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఏపీలో రేషన్ బియ్యం మాఫియాకు డోర్ డెలివరీ కోసమంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు కారణమంటూ విమర్శించారు. ఏకంగా 1600 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాల ద్వారా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకుని అక్రమంగా బియ్యం తరలిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దానికి ఆధారంగా గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలలో జరిగిన బియ్యం ఎగుమతుల విలువను వెల్లడించారు. రూ. 48,537 కోట్ల విలువైన బియ్యం కాకినాడ…

Read More

రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి కారకులెవరు? పవన్ కి ఇది అర్థమయితేనే!

సమస్య మూలాల నుంచి పరిష్కరించాలి. పైపై పూతలు కొంతకాలమే ఫలిస్తాయి. మళ్లీ మళ్లీ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. సరిగ్గా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అదే జరుగుతుంది. ఎవరైనా అధికారి లేదా ఇంకో నాయకుడు సందడి చేసిన సమయంలో ఓ వారం సర్ధుమణగడం, మళ్లీ చెలరేగిపోవడం అన్నది ఆనవాయితీగా మారుతోంది. మొన్నటి జూన్ లో ఇదే జరిగింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించగానే కాకినాడ వెళ్లారు. కలియ తిరిగారు….

Read More

చంద్రబాబు మన్ కీ బాత్ ముహూర్తం సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం గడిచిన పదేళ్లుగా జరుగుతోంది. తాజాగా దానిని ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించబోతోంది. సీఎం చంద్రబాబు కూడా అలాంటి కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ప్రారంభించే ప్రయత్నం జరుగుతోంది. “మీతో.. మీ చంద్రబాబు” పేరుతో నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉంది….

Read More

సీపీఎం మీద ఏబీఎన్ ఆర్కే అక్రోశం అందుకేనా?

ఏపీలో సీపీఎం బలం గతంతో పోలిస్తే తగ్గింది. ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆపార్టీ బలహీనపడిందన్నది బహిరంగ రహస్యం. అయినా సీపీఎం విధానం మాత్రం చాలామందికి కంటిగింపుగానే ఉంటుంది. పార్టీ బలహీనపడుతుందని ఓవైపు హేళన చేస్తూనే ఇంకా ఆపార్టీ తన విధానానికి కట్టుబడి ఉందనే కలవరం వారిలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో ఏబీఎన్ రాధాకృష్ణ ఒకరు. పది రోజుల క్రితం ఆయన పత్రికలోనే సీపీఎం విధానం గురించి ఓ గాలి వార్త రాశారు. దానిని చాలామంది సోషల్…

Read More

తెలుగు రాష్ట్రాల విపక్షాలది ఒకే వ్యూహమా? అరెస్టు కోసం ఎదురుచూస్తున్నారా?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో Arrest Me అనే కామెంట్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ Arrest Me కామెంట్లపై చర్చ పెరిగింది. తెలంగాణలో Arrest Me రాగాన్ని కేటీఆర్ గత కొంత కాలంగా ఆలపిస్తుంటే.. తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా అదే తరహా రాగం అందుకున్నారు. హైదరాబాదులో ఫార్మూలా-ఈ రేసింగ్ కోసం 55 కోట్ల రూపాయలను కెబినెట్ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారనేది బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్…

Read More

మహానాడు వక్తలకు రాజబోగం.. ఐటిడిపికి మొండిచెయ్యి

నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ ఐటిడిపి సోషల్ మీడియా వింగ్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి, రెండవ జాబితాల్లో ఐటిడిపి నుంచి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోడంపై మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు. వైసిపి అధికారంలో ఉండగా తాము కూడా కేసులు ఎదుర్కొన్నామని..పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పదవులు రావడంలేదని మొరపెట్టుకుంటున్నారు. వైసిపి సోషల్ మీడియా వలన ఐదేళ్లుగా వ్యక్తిగతంగా తాము చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామని.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు న్యాయం చేయలేపోతున్నారాని…

Read More

వాలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు

వాలంటీర్ల వ్యవస్థ అమలుపై ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన అధినేతలు ఊదర గొట్టారు.వైసిపి ప్రభుత్వం ఇస్తున్న 5000 జీతం కంటే మెరుగైన గౌరవ వేతనం ఇస్తాం.వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం. వాలంటిర్లలో డిగ్రీ , పీజీ చేసిన వారు కూడా ఉన్నారు.వారికి శిక్షణ ఇచ్చి సాప్ట్ వేర్ ఉద్యోగులుగా తీర్చి దిద్దుతాము.తమపై వైసిపి చేసే ప్రచారాన్ని నమ్మకండని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలను కోరారు.ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించింది.మంత్రులకు శాఖలు కేటాయింపులో వార్డు వాలంటర్…

Read More