గ్యాస్ ధర మళ్లీ పెరిగింది!విమాన ఛార్జీల వాయింపే!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్న వేళ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధర పెంచింది. ఓవైపు పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్న వేళ దేశీయంగా గ్యాస్ కంపెనీలు ధరలు సవరించడం ఆందోళనకరంగా మారుతోంది.
దీపావళి పండుగ తెల్లవారే గ్యాస్ సిలెండర్ల ధర సవరిస్తూ ప్రకటన వెలువడింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల ప్రకారం ఈ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 62 పెరిగి రూ.1802కు చేరుకుంది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి పెంపుదల ప్రస్తుతానికి లేదని తెలిపాయి. ఇది సామాన్య ప్రజలకు కాసింత ఊరటనిచ్చే అంశం. అయితే గల్ఫ్ దేశాల్లో యుద్ధం ముదిరితే మాత్రం అది ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి మీద ప్రభావం పడుతుంది. అనివార్యంగా ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
19 కిలోల కమర్షియల్ సిలెండర్ విజయవాడలో రూ. 1962, హైదరాబాద్ లో రూ. 2028 చేరింది.
రెండోవైపు విమాన ఛార్జీలు పెరగబోతున్నాయి. ఏటీఎఫ్ పెంచడంతో విమానయానం మరింత భారంగా మరబోతోంది.
ఇంధన ధరలను పెంచాయి. దీంతో రానున్న రోజుల్లో విమాన టిక్కెట్లు ఖరీదయ్యే అవకాశం ఉంది. నవంబర్ మొదటి తేదీ నుంచి చమురు కంపెనీలు జెట్ ఇంధనం అంటే ATF ధరలను కిలోకు 3 వేల రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. అంతిమంగా ఈ ఆయిల్ ధరల భారం విమాన ప్రయాణీకులపై వడ్డన తప్పదు.
