సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ
ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు.
డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్ ఆ తర్వాత సినిమాల ఆపేక్షతో టాలీవుడ్ లో అడుగుపెట్టి మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోవడంతో కొంత వెనుకబడ్డారు.
ఇటీవల హరిహరవీరమల్లు సినిమా కొంత షూటింగ్ తర్వాత హఠాత్తుగా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లోని తొలిసినిమా నుంచి దర్శకుడు హఠాత్తుగా తప్పుకున్నారు. ప్రస్తుతం అనుష్కతో ఘాటీ సినిమా సిద్ధం చేశారు. త్వరలో అది విడుదల కాబోతోంది. ఈలోగా పెళ్లి వేడుకలకు సిద్ధం కావడంతో ఆయనకు పలువురు విషెస్ చెబుతున్నారు.