రాజ్యసభలో డబ్బు కట్టలు
భారత పార్లమెంట్ లోని ఎగువ సభ రాజ్యసభలో డబ్బులు కలకలం రేపాయి. డబ్బుల కట్ట లభించడంతో అంతా అప్రమత్తమయ్యారు. రాజ్యసభ చైర్మన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది.
అమెరికాలో అదానీ మీద కేసుల గురించి చర్చించాలని విపక్షం పట్టుబడుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తోంది. శుక్రవారం కూడా సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఇరుసభల్లో ఆందోళనకు పూనుకున్నారు.
అదే సమయంలో రాజ్యసభలో డబ్బుల కట్ట దుమారం రేపుతోంది. ఎంపీ అభిషేక్ మను సంఘ్వీ సీటు దగ్గర డబ్బులు దొరికడం విశేషం. విచారణ జరుగుతోందని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. అయితే డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. పార్లమెంట్ లో అంత పెద్ద మొత్తం ఎలా వచ్చిందన్నది కూడా తేలాల్సి ఉంది. రూ.500 నోట్లు దాదాపు వంద ఉన్నట్లు గుర్తించారు.
గతంలో కూడా పార్లమెంట్ లో ఓటుకి నోటీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పార్లమెంట్ లో ప్రశ్నలు వేసేందుకు పైసలు తీసుకుంటున్న ఉదంతం వెలుగు చూసింది. ఇప్పుడు మరోసారి నోట్ల కట్టలు రాజ్యసభలో వెలుగులోకి రావడం విశేషం.