రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉండడానికి కారణమదేనా, టాలీవుడ్ ఆశించింది జరిగేనా?

ఆకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి ఆకు మీద పడినా నష్టపోయేది ఆకు అన్నది నానుడి. సరిగ్గా టాలీవుడ్ కి ఇది వర్తించేలా కనిపిస్తోంది. పాలకపక్ష నేతకు కోపం వచ్చినా టాలీవుడ్ కే నష్టం. టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆగ్రహం కలిగినా వాళ్లే నష్టపోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్- రేవంత్ రెడ్డి ఉదంతం అందుకు సాక్ష్యంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అందుకు కొనసాగింపుగానే కనిపిస్తోంది. ప్రభుత్వాలకు…

Read More

ఏపీలో పెట్టుబడుల మీద తెలంగాణా మంత్రి కీలక వ్యాఖ్యలు

తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి వరద ముప్పు కారణంగా ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదంటూ అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు రాగానే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనేది తప్పుడు ప్రచారం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్‌, బెంగళూరుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటూ మంత్రి పొంగులేటి అన్నారు. ఏపీలో ఇటీవల ప్రభుత్వం వరుసగా…

Read More

రాజ్యసభలో డబ్బు కట్టలు

భారత పార్లమెంట్ లోని ఎగువ సభ రాజ్యసభలో డబ్బులు కలకలం రేపాయి. డబ్బుల కట్ట లభించడంతో అంతా అప్రమత్తమయ్యారు. రాజ్యసభ చైర్మన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. అమెరికాలో అదానీ మీద కేసుల గురించి చర్చించాలని విపక్షం పట్టుబడుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తోంది. శుక్రవారం కూడా సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఇరుసభల్లో ఆందోళనకు పూనుకున్నారు. అదే సమయంలో రాజ్యసభలో డబ్బుల కట్ట దుమారం రేపుతోంది. ఎంపీ అభిషేక్‌…

Read More

రాహుల్ గాంధీకి వర్తించని నిభందన…మీకు ఎలా సాధ్యం జగన్ ?

ప్రభుత్వ విధానాలను చర్చిండానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి గొప్ప వేదికలు చట్ట సభలు.అలాంటి ప్రజాస్వామ్య అవకాశం అందరికి దొరుకుతుందా? రాజ్యంగ బద్ధ సంస్థ ద్వారా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శాసనసభ్యలు ఆ విషయాన్నే మర్చిపోయారా? ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు అసెంబ్లీ ఎందుకు అని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తున్నారు? పార్టీ కార్యాలయం నుంచే పాలక పార్టీ ని ప్రశ్నిస్తూ ఉంటాము అని ప్రకటిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధికార ప్రతినిధి వరకు…

Read More