మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్! మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు!

సినీ నటుడు మోహన్ బాబు వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయన మీద హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును హత్యాయత్నంగా మార్చారు. ఆయన నివాసం వద్ద మంగళవారం సాయంత్రం టీవీ9 ప్రతినిధి రంజిత్ మీద మైక్ తో దాడి కేసులో పోలీసులు స్పందించారు. మీడియా ప్రతినిధుల ఆందోళనతో కేసును సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

దానికి తగ్గట్టుగా మోహన్ బాబు మీద నమోదు చేసిన కేసులో బీఎన్ఎస్ సెక్షన్ 109ను జత చేశారు. తొలుత ఈ కేసుని సెక్షన్ 118 కింద నమోదు చేశారు. వివిధ వర్గాల నుంచి ఆరోపణలు రావడంతో చివరకు కేసును పహాడి షరీఫ్ పోలీసులు కట్టుదిట్టంగా మారుస్తున్నట్టు కనిపిస్తోంది. నాన్ బెయిలబుల్ సెక్షన్లను జోడించారు.

మరోవైపు మోహన్ బాబు దాడిలో గాయపడిన టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌కు యశోద ఆస్పత్రిలో సర్జరీ పూర్తయ్యింది. జైగోమాటిక్ బోన్‌ను వైద్యుల బృందం సరిచేసినట్టు టీవీ9 వర్గాలు చెబుతున్నాయి. కంటికి, చెవికి మధ్య మూడు లెవెల్స్‌లో ఫ్రాక్చర్లయినట్టు వెల్లడించారు.
మూడు చోట్ల విరిగిన జైగోమాటిక్ ఎముకకి ఫ్రాక్చర్లు అయిన చోట సర్జరీ చేసి..స్టీల్ ప్లేట్ అమర్చి నట్టు తెలిపారు. యశోద ఆస్పత్రిలో ప్రస్తుతం వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్న రంజిత్ కోలుకుంటున్నట్టు ప్రకటించారు.

మరోవైపు మంచు కుటుంబ ఆస్తుల తగాదాలో పోలీసులు మంచు మనోజ్, మంచు విష్ణును విచారించారు. ఇరువురు పోలీసుల ముందు హాజరయ్యి తమ వాదన వినిపించారు. వివాదాలకు తావులేకుండా సమస్య పరిష్కరించుకోవాలని వారికి సూచించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *