బాహుబలిని బీట్ చేసిన పుష్ప2! ఇక మిగిలింది ఆ సినిమానే!

ఇండియన్ మువీ ఇండస్ట్రీలో పుష్ప2 కొత్త రికార్డ్ బ్రేక్ చేసింది. టాలీవుడ్ సత్తాను చాటిచెప్పింది. బాహుబలిని బీట్ చేసి రికార్డ్ కలెక్షన్లు సాధించింది. 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1799 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొత్త రికార్డ్ నెలకొల్పింది.

దీంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ మువీ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు ను పుష్ప 2 బ్రేక్ చేసినట్లు అయింది. బాహబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1788 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ప్రస్తుతం పుష్ప2 కేవలం దంగల్ తర్వాతి స్థానంలో ఉంది. దేశ సినిమా చరిత్రలో దంగల్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉంది. దానికి 2070 కోట్ల వరకూ వచ్చింది.

పుష్ప2 విజయం వెనుక హిందీ బెల్ట్ లో దక్కిన ఆదరణ ప్రధాన కారణం. తెలుగు హీరో నటించిన సినిమా అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల కన్నా బాలీవుడ్ ప్రేక్షకుల్లోనే ఎక్కువ వసూళ్ల వర్షం కురింది ఎవరూ ఊహించని రీతిలో విజయం దక్కించుకుంది.

2025 జనవరి 1 నాడు వసూళ్లను చూస్తూ ఈ విషయం స్పష్టమవుతుంది కొత్త ఏడాది తొలిరోజు తెలుగు వెర్షన్ కేవలం 3.10 కోట్లను మాత్రమే వసూలు చేయగా, హిందీ వర్షన్ ఏకంగా 9.5 కోట్లు దక్కించుకుంది. అంటే మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేసింది.

ఇక పుష్ప2 మొత్తం వసూళ్ల విషయానికి వస్తే ఇండియన్ మార్కెట్ నుంచే 1184 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *