విశాఖలో ఆరుగురు అమ్మాయిలు మాయం, కళ్లలో కారం జల్లిపారిపోయారని ఫిర్యాదు
విశాఖ జిల్లాలో ఒకేరోజు ఆరుగురు అమ్మాయిలు పరారయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్వధార్ హోం నుంచి వారంతా పారిపోయారు. దాంతో ఈ ఘటన సంచలనంగా మారింది. పెందుర్తి మండలంలోని స్వధార్ గృహం నుంచి ఆరుగురు బాధిత యువతులు పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. వారంతా వివిధ కేసుల్లో న్యాయస్థానం నుంచి ఆదేశాల మేరకు స్వధార్ లో ఉంటున్నారు. వారికి తగిన సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా నిర్వాహకులను కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయినట్టు పోలీసులకు…