Editor

కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేయలేమని తేల్చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న పనామా స్టెల్లా షిప్ ను సీజ్ చేయలేమని ఏపీ ప్రభుత్వం తేల్చేసింది. అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దానికి తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు సహా ఇతర అక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ…

Read More

కాకినాడ: అప్పుడు డీప్ వాటర్ పోర్టు, ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ బలి చేస్తున్నారా?

కాకినాడ పోర్ట్ వ్యవహారం పెను దుమారం దిశగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ రాజేసిన వివాదం ఇప్పట్లో సర్థుమణిగేలా లేదు. దానికి కారణం ఏకంగా కాకినాడలో సుదీర్ఘ చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్ట్ మీద ప్రభుత్వం కన్నేసిందన్న ప్రచారమే. ఏకంగా యాంకరేజ్ పోర్ట్ మూతవేసే దిశలో ఉందంటూ వస్తున్న కథనాలే అందుకు కారణంగా కనిపిస్తోంది. కాకినాడ తీరం కొంత భిన్నంగా ఉంటుంది. కాకినాడ పోర్టుకి ఎదురుగా బంగాళాఖాతంలో హోప్ ఐలాండ్ ఏర్పడడం,…

Read More

రేషన్ అక్రమరవాణాకు మూలం అవేనట..మాఫియా నియంత్రణ కష్టమట!

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఏపీలో రేషన్ బియ్యం మాఫియాకు డోర్ డెలివరీ కోసమంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు కారణమంటూ విమర్శించారు. ఏకంగా 1600 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాల ద్వారా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకుని అక్రమంగా బియ్యం తరలిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దానికి ఆధారంగా గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలలో జరిగిన బియ్యం ఎగుమతుల విలువను వెల్లడించారు. రూ. 48,537 కోట్ల విలువైన బియ్యం కాకినాడ…

Read More

ఏబీఎన్, టీవీ5 తగాదాకి మూలమైన తలనూనె మళ్లీ వచ్చింది!

నూజెన్ హెయిర్ ఆయిల్ గుర్తుందా, చాన్నాళ్లకు మళ్లీ వచ్చింది. కొంతకాలం మరుగున పడిన ఆ తలనూనె మళ్లీ తడాఖా చూపించే దిశలో సాగుతోంది. టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకి ఇటీవల పదవీయోగం దక్కింది. ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారు. ఆయనకు అధికార హోదా దక్కిన తర్వాత చాలాకాలానికి మళ్లీ నూజెన్ హెయిర్ ఆయిల్ తెరమీదకు వచ్చింది. ప్రకటనలు కనిపిస్తున్నాయి. పదేళ్లకు పూర్వం నూజెన్ హెయిర్ ఆయిల్ ఓ సంచలనం. బట్టతల మీద జట్టు మొలిపించేస్తామంటూ…

Read More

రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి కారకులెవరు? పవన్ కి ఇది అర్థమయితేనే!

సమస్య మూలాల నుంచి పరిష్కరించాలి. పైపై పూతలు కొంతకాలమే ఫలిస్తాయి. మళ్లీ మళ్లీ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. సరిగ్గా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అదే జరుగుతుంది. ఎవరైనా అధికారి లేదా ఇంకో నాయకుడు సందడి చేసిన సమయంలో ఓ వారం సర్ధుమణగడం, మళ్లీ చెలరేగిపోవడం అన్నది ఆనవాయితీగా మారుతోంది. మొన్నటి జూన్ లో ఇదే జరిగింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించగానే కాకినాడ వెళ్లారు. కలియ తిరిగారు….

Read More

రేషన్ బియ్యం మాఫియాపై రంగంలోకి పవన్ కళ్యాణ్‌, అధికారులపై సీరియస్

కాకినాడ నుంచి పోర్ట్ నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం వ్యవహారం దుమరం రేపుతోంది. రేషన్ బియ్యం మాఫియా యధేశ్ఛగా బియ్యం తరలింపు సాగిస్తున్న తరుణంలో నేరుగా డిప్యూటీ సీఎం రంగంలో దిగడం ఆసక్తిగా మారింది. కాకినాడ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్…

Read More

కంగనా కథ నమ్మేసి అభాసుపాలయిన ఆంధ్రజ్యోతి!

ఆంధ్రజ్యోతి తప్పులో కాలేసింది. నిర్ధారణ లేని వార్త రాసి చేతులు కాల్చుకుంది. మరి తప్పిదాన్ని సరిదిద్దుకునేలా రేపు పాఠకులకు అసలు వాస్తవం చెబుతుందో లేదో చూద్దాం. అందరికీ నీతులు చెప్పే బల్లి కుడితిలో పడిందన్న నానుడి చందంగా వేమూరి రాధాకృష్ణ పత్రిక తీరు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెక్యూరిటీలో మహిళా అధికారి ఉన్నట్టుగా ఫోటోతో వార్త ఇచ్చింది. కానీ అది అది వాస్తవం కాదు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాడీగార్డ్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా…

Read More

సీఎం రమేశ్ ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి పంపించిన ఎంపీ

అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తగదంటూ ఆయనకు సహచర మంత్రి హితువు పలికారు. ఖరీదైన కానుకలతో ఎంపీలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ తీరుతో సీఎం రమేశ్‌ ఖంగుతినాల్సి వచ్చింది. పార్లమెంట్ లో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని కమిటీ స్టడీ టూర్ కి వెళ్లిన సమయంలో కమిటీ సభ్యులకు…

Read More

ఆ పెళ్లి మీద ట్రోలింగ్ ఎందుకు బ్రో..?

సినీ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. అందులో హీరో ప్రభాస్, టీవీ స్టార్లు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్ల పేర్లుంటాయి. చాలాకాలం పాటు వెయిట్ చేసిన సుబ్బరాజు ప్రస్తుతం వాళ్ల లిస్టు నుంచి బయటపడడం విశేషమే. చాలాకాలంగా తన పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్న సుబ్బరాజు తాజాగా తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్…

Read More

నాగార్జున వియ్యంకుడు దుబాయ్ లో చానా రిచ్!

అఖిల్ అక్కినేని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పటికే ఓసారి జీవీకే మనుమరాలు శ్రేయస్ భూపాల్ తో నిశ్చితార్థం వరకూ వెళ్ళి వెనక్కి తగ్గిన ఈ అక్కినేని చిన్నోడు ఈసారి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన సహచరి జైనబ్ రావుడ్జీతో పెళ్లికి రెడీ అవుతున్నాడు. జైనబ్ కుటుంబానికి దుబాయ్ లో పెద్ద నెట్ వర్క్ ఉంది. పశ్చిమాసియాలోనే పలుకుబడి కలిగిన బడా బిజినెస్ మేన్ ఆమె తండ్రి. గతంలో ఎనర్జీ సెక్టార్ లో…

Read More