మహానటి కీర్తి సురేష్ పెళ్లి మహుర్తం ఫిక్స్, భర్త ఎవరంటే?
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపీటలెక్కుతోంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో వివాహ వేడుక జరుగుతోంది. ఆమె చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడబోతోంది. ఈ పెళ్లికి గోవా వేదిక కానుంది.
కీర్తి సురేష్ తెలుగులో ప్రముఖ హీరోలందరి సరసన నటించింది. మహానటి ద్వారా విశేష కీర్తి గడిచింది. ప్రతిభ కలిగిన నటిగా మన్ననలు పొందింది. అనేక అవార్డులు కూడా దక్కించుకుంది. జాతీయ స్థాయి ఉత్తమనటిగానూ ఎదిగింది.
తాజాగా తన పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్ 11న కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరగబోతోంది. దానికి తగ్గట్టుగా గోవాలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ఆమె భర్త ఆంటోని తట్టిల్ తో 15 ఏళ్లుగా స్నేహం చేస్తోంది. ఇద్దరూ హైస్కూల్ నుంచి సన్నిహితులు. సుదీర్ఘకాల స్నేహం చివరకు ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లికి సిద్దమవుతుందన్న మాట. తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ చిత్ర సీమల్లో పలువురు ఫ్యాన్స్ ను సంపాదించుకున్న కీర్తి సురేష్ పెళ్లి తన చిన్న నాటి స్నేహితుడితో జరుగుతుండడం విశేషమే. చాలామంది సినీ సెలబ్రిటీల తీరుతో పోలిస్తే ఇది భిన్నమే.