రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉండడానికి కారణమదేనా, టాలీవుడ్ ఆశించింది జరిగేనా?

ఆకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి ఆకు మీద పడినా నష్టపోయేది ఆకు అన్నది నానుడి. సరిగ్గా టాలీవుడ్ కి ఇది వర్తించేలా కనిపిస్తోంది. పాలకపక్ష నేతకు కోపం వచ్చినా టాలీవుడ్ కే నష్టం. టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆగ్రహం కలిగినా వాళ్లే నష్టపోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్- రేవంత్ రెడ్డి ఉదంతం అందుకు సాక్ష్యంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అందుకు కొనసాగింపుగానే కనిపిస్తోంది. ప్రభుత్వాలకు…

Read More

విశాఖ డెయిరీలో టీడీపీ లక్ష్యం నెరవేరిందా?

విశాఖ డెయిరీని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో పాలక టీడీపీకి సానుకూల సంకేతం దక్కింది. ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీలో ఉన్న ఆ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, ఇతర డైరెక్టర్లు రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. దాంతో వారిని టీడీపీలో చేర్చుకోవడమా లేక బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్న అడారి ఆనంద్ కి సహకరించడమా అన్నదే మిగిలింది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరుపున బరిలో దిగిన అడారి ఆనంద్ ఓటమి…

Read More

జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర : రాచమల్లు

నందమూరి కుటుంబంలో జరిగినవే కారు ప్రమాదాలా? వైయస్ విజయమ్మ తన ప్రయాణంలో కారు టైర్లు ఉడిపోతే జగన్మోహన్ రెడ్డినే హత్య కు కుట్ర చేశారని ఆరోపణలు చేస్తారా? నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే నీచమైన ప్రయత్నం టీడిపి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వైయస్ఆర్ కడప జిల్లాలోని తన నివాసం నుంచి ఒక వీడియో విడుదల చేశారు….

Read More

విశాఖలో ఆరుగురు అమ్మాయిలు మాయం, కళ్లలో కారం జల్లిపారిపోయారని ఫిర్యాదు

విశాఖ జిల్లాలో ఒకేరోజు ఆరుగురు అమ్మాయిలు పరారయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్వధార్ హోం నుంచి వారంతా పారిపోయారు. దాంతో ఈ ఘటన సంచలనంగా మారింది. పెందుర్తి మండలంలోని స్వధార్ గృహం నుంచి ఆరుగురు బాధిత యువతులు పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. వారంతా వివిధ కేసుల్లో న్యాయస్థానం నుంచి ఆదేశాల మేరకు స్వధార్ లో ఉంటున్నారు. వారికి తగిన సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా నిర్వాహకులను కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయినట్టు పోలీసులకు…

Read More

భారీ వర్ష సూచన, రైతులు సర్దుకోండి!

నవంబర్ నెలాఖరులో ఏపీలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అంతా అప్రమత్తం కావాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందంటూ అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతోంది. తర్వాత,…

Read More

సీఎం రమేశ్ ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి పంపించిన ఎంపీ

అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తగదంటూ ఆయనకు సహచర మంత్రి హితువు పలికారు. ఖరీదైన కానుకలతో ఎంపీలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ తీరుతో సీఎం రమేశ్‌ ఖంగుతినాల్సి వచ్చింది. పార్లమెంట్ లో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని కమిటీ స్టడీ టూర్ కి వెళ్లిన సమయంలో కమిటీ సభ్యులకు…

Read More

మోహన్ బాబు- మనోజ్ బాబు- మీడియా తప్పు ఎవరిది? శిక్ష ఎవరికీ?

మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కొత్తది కాదు. కొంతకాలంగా దాని ఆనవాళ్లు బయటకు వస్తూనే ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చివరికిలా బయటపడింది. అయితే ఈసారి కూడా భౌతికదాడులు, బౌన్సర్ల తో గొడవలు, గేట్లు నెట్టుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు వంటివి చూస్తున్నాం. సహజంగానే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ల చుట్టూ ఏం జరిగినా జనాల్లో ఆసక్తి ఉంటుంది. మీడియాకు మంచి సరుకుగా మారుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అనూహ్యంగా మీడియానే నిందిస్తూ, మితిమీరి…

Read More

జమిలీ ఖాయమే కానీ, ఇప్పుడే కాదంటున్న చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమిలీ ఎన్నికలు జరగబోతున్నట్టు పరోక్షంగా అంగీకరించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్ ఛాట్ గా మాట్లాడిన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు. 2027లోనే ఎన్నికలు ఖాయమంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ వైసీపీ పబ్బం…

Read More

ఈదుపురంలో దీపం పథకంకు శ్రీకారం

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.O పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఆయన హెలికాప్టర్లో ఈదుపురం చేరుకున్నారు. అక్కడ సుమారు అరగంట పైన సీనియర్ నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఈదుపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్యాస్ సిలిండర్ల వాహనాలకు జెండా ఊపి, కార్యక్రమాన్ని లాంఛనంగా…

Read More

ఏపీ పీఏసీ కోసం ఎన్నికలే, ఏకగ్రీవానికి అంగీకరించని కూటమి నేతలు

సంప్రదాయానికి భిన్నంగా సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని విపక్షానికి అప్పగించడం 1966 నుంచి అమలవుతోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆపార్టీ పక్షాన పులవర్తి రామాంజనేయులుకి పీఏసీ దక్కబోతోంది. తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగానే ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. తీరా అందుకు భిన్నంగా జనసేన నేతను బరిలో దింపాలని కూటమి నేతలు…

Read More