ఇజ్రాయెల్ మీద ఎదురుదాడి దిశలో ఇరాన్, యూఎస్ ఎన్నికల తర్వాత సంక్లిష్టమే!
పశ్చిమాసియా పరిస్థితులు పట్టుతప్పేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముదురుతున్న యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయోలు, ఇరాన్ మధ్య యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడితో ఉధృతమయిన పరిస్థితులు గత వారం ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలతో మరింత తీవ్రంగా మారింది. తాజాగా మరోసారి ఇజ్రాయెల్ మీద దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగా ఇరాన్ బలగాలకు దేశ అధ్యక్షుడి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇరాక్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ మీద విరుచుకుపడాలని ఇరాన్ భావిస్తోంది….
కేంద్రం నుంచి అనుమతులు వస్తే విశాఖ మెట్రో!
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక(సీఎంపి) సిద్దం చేశామని ఏపీ పట్టణాభివృద్ధి , మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. “ప్రణాళికను ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం విశాఖ,విజయవాడకు మెట్రో రైల్ రాకుండా కక్షపూరితంగా పక్కన పెట్టేసింది. విశాఖలో భోగాపురం ఎయిర్…
రెహ్మాన్ కి మాటిచ్చిన రామ్ చరణ్ అక్కడికెళ్లారు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట నిలబెట్టుకున్నారు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాటకు తగ్గట్టుగా వ్యవహరించారు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్.. ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాను ఎ.ఆర్.రెహ్మాన్ క్రమ తప్పకుండా సందర్శిస్తుంటారు. 2024లో ఇక్కడ జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ను తీసుకొస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్…..
ఉచిత బస్సుపై నీలినీడలు..పొరుగున సంకేతాలు ఏమిటి?
ఎన్నికల్లో ఓటరు తీర్పును స్థానిక పరిస్థితులే కాకుండా పొరుగున జరిగే సంఘటనలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. దక్షణాది రాష్ట్రాలకు ఈ వాక్యం కచ్చితంగా సరిపోతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 6 ఫార్ములాను తీసుకువచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తమ మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని జాతీయ నాయకులు నుంచి రాష్ట్ర నాయకులు వరకు ప్రగల్భాలు పలికారు.2023 మే లో జరిగిన…
ఇరాన్ మహిళ దుస్తులు విప్పేసింది కారణమేంటి?
ఇరాన్ రాజధాని నగరం తెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ సైన్స్, రీసర్చ్ బ్లాక్-1 దగ్గర ఓ మహిళ అర్థనగ్నంగా కనిపించారు. ఇన్నర్ వేర్ మాత్రమే ధరించిన ఒక అమ్మాయి యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఒక గోడపై కూర్చున్న వీడియో వైరల్ అయ్యింది. ఆమె నిరసన తెలుపుతూ ఇలా ప్రవర్తించిందనే వాదన వినిపించింది. సోషల్ మీడియాలో ఆమెకు మద్ధతుగా పోస్టింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా ఆమె మానసిక స్థితి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులు…
చంద్రబాబు మన్ కీ బాత్ ముహూర్తం సిద్ధం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం గడిచిన పదేళ్లుగా జరుగుతోంది. తాజాగా దానిని ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించబోతోంది. సీఎం చంద్రబాబు కూడా అలాంటి కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ప్రారంభించే ప్రయత్నం జరుగుతోంది. “మీతో.. మీ చంద్రబాబు” పేరుతో నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉంది….
అక్కడికి టీమిండియా వెళ్లడం లేదు.. ఇప్పుడేమవుతుంది?
పాకిస్తాన్ లో నిర్వహించబోయే ఛాంపియన్స్ ట్రోపీకి తమ టీమ్ ని పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టబోదంటూ తేల్చేసింది. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. గత ఏడాది ఆసియా కప్ మ్యాచ్ ల కోసం కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు. దాంతో హైబ్రీడ్ పద్ధతిలో టీమిండియా మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు కూడా అలాంటి మార్గం అన్వేషించాలని బీసీసీఐ కోరుతోంది. ఇండియా- పాకిస్తాన్…
బోరుగడ్డ అనిల్ కేసులో టీవీ5 ప్రతినిధి అరెస్ట్
ఏపీలో విపక్షం మీదనే కాదు.. టీడీపీ గొంతుగా మారిన టీవీ5 జర్నలిస్టులను కూడా పోలీసులు వదలడం లేదు. తాజాగా గుంటూరులో టీవీ5 జర్నలిస్ట్ పాలడుగు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గుంటూరులో ఆయన కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ లో ఉన్న కాలంలో ఆయనకు సకల సదుపాయాలు కల్పించారంటూ టీవీ5 కొన్ని కథనాలు ప్రచారం చేసింది. పోలీస్ స్టేషన్ కి చెందిన సీసీ ఫుటేజ్ ను…