
ఏపీ శాసనమండలిలో పెరిగిన పీడీఎఫ్ బలం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఊపు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పీడీఎఫ్ తన బలం పెంచుకుంది. సిట్టింగ్ టీచర్ సీటుని నిలబెట్టుకుంది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీటుకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. 65 శాతం పైబడి ఓట్లు దక్కించుకుంది. త్వరలో జరగబోతున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికలకు తమ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. టీచర్ ఎమ్మెల్సీగా ఉండగా షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆ సీటుకి ఉప ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి సునాయాసంగా…