చంద్రబాబు మన్ కీ బాత్ ముహూర్తం సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం గడిచిన పదేళ్లుగా జరుగుతోంది. తాజాగా దానిని ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించబోతోంది. సీఎం చంద్రబాబు కూడా అలాంటి కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ప్రారంభించే ప్రయత్నం జరుగుతోంది. “మీతో.. మీ చంద్రబాబు” పేరుతో నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉంది….

Read More

ఉచిత బస్సుపై నీలినీడలు..పొరుగున సంకేతాలు ఏమిటి?

ఎన్నికల్లో ఓటరు తీర్పును స్థానిక పరిస్థితులే కాకుండా పొరుగున జరిగే సంఘటనలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. దక్షణాది రాష్ట్రాలకు ఈ వాక్యం కచ్చితంగా సరిపోతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 6 ఫార్ములాను తీసుకువచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తమ మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని జాతీయ నాయకులు నుంచి రాష్ట్ర నాయకులు వరకు ప్రగల్భాలు పలికారు.2023 మే లో జరిగిన…

Read More

ఆడబిడ్డల భద్రతే మొదటి ప్రాధాన్యం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయినట్లు వైసీపీ నాయకులు,వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా…

Read More

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ

ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్‌ ఆ తర్వాత సినిమాల…

Read More

వైయస్ షర్మిలకు భద్రత అవసరమా ? : కాకాని గోవర్ధన్

మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకొని వై. యస్. షర్మిలకు తాము భద్రత కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.శనివారం నెల్లూరు లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందాకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్…

Read More

గోదావరి జిల్లాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందా?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్డీయే కూటమి గెలుచుకుంది. కూటమిలో టీడీపీ-15, జనసేన-5, బీజేపీ ఒకటి చొప్పున దక్కించుకున్నాయి. మూడు ఎంపీ సీట్లను కూడా తలో ఒకటి చొప్పున మూడు పార్టీలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశాయి. ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇప్పటి వరకూ కేటాయించిన వాటిలో బీసీలకు…

Read More

ఏలూరు మెడికల్ కాలేజీకి యల్లాప్రగడ పేరు ఖరారు

ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాల పేరును “డా. ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు”గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలపడంతో కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మెడకిల్ కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి బయో కెమిస్ట్రీలో విశేష పరిధోనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన…

Read More

ఏపీ పీఏసీ కోసం ఎన్నికలే, ఏకగ్రీవానికి అంగీకరించని కూటమి నేతలు

సంప్రదాయానికి భిన్నంగా సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని విపక్షానికి అప్పగించడం 1966 నుంచి అమలవుతోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆపార్టీ పక్షాన పులవర్తి రామాంజనేయులుకి పీఏసీ దక్కబోతోంది. తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగానే ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. తీరా అందుకు భిన్నంగా జనసేన నేతను బరిలో దింపాలని కూటమి నేతలు…

Read More

సమిష్టి నాయకత్వంతోనే సంక్షేమం : హరిప్రసాద్

ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఉచిత సిలిండర్ల కార్యక్రమాన్ని సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్యం ఎన్నికలముందు ఇచ్చిన హామీ ప్రకారం దీపం 2 పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. దిగువ మధ్య తరగతి ఇళ్ళల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ ఉచిత సిలిండర్ల…

Read More