Editor

కేంద్రం నుంచి అనుమతులు వస్తే విశాఖ మెట్రో!

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక‌(సీఎంపి) సిద్దం చేశామని ఏపీ పట్టణాభివృద్ధి , మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్ర‌శ్నోత్త‌రాల్లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై ప్రశ్నకు ఆయన స‌మాధానమిచ్చారు. “ప్ర‌ణాళిక‌ను ఇప్ప‌టికే కేంద్ర‌ప్ర‌భుత్వానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ ప‌నులు ప్రారంభిస్తాం. గ‌త ప్ర‌భుత్వం విశాఖ‌,విజ‌య‌వాడ‌కు మెట్రో రైల్ రాకుండా క‌క్ష‌పూరితంగా ప‌క్క‌న పెట్టేసింది. విశాఖ‌లో భోగాపురం ఎయిర్…

Read More

అక్కడికి టీమిండియా వెళ్లడం లేదు.. ఇప్పుడేమవుతుంది?

పాకిస్తాన్ లో నిర్వహించబోయే ఛాంపియన్స్ ట్రోపీకి తమ టీమ్ ని పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టబోదంటూ తేల్చేసింది. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. గత ఏడాది ఆసియా కప్ మ్యాచ్ ల కోసం కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు. దాంతో హైబ్రీడ్ పద్ధతిలో టీమిండియా మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు కూడా అలాంటి మార్గం అన్వేషించాలని బీసీసీఐ కోరుతోంది. ఇండియా- పాకిస్తాన్…

Read More

పోలీసుల తీరుతో కలత చెందిన పవన్ కళ్యాణ్, బాధితులకు క్షమాపణ

ఏపీ ఉపముఖ్యమంత్రి మరోసారి పోలీసుల తీరుతో కలత చెందారు. ఈసారి ఏకంగా బాధితులకు క్షమాపణ కూడా చెప్పారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం విషయంలో పోలీసుల వ్యవహారశైలితో పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది. అంతేగాకుండా తన ట్రస్ట్ తరుపున బాధిత కుటుంబానికి రూ. 2లక్షల నష్టపరిహారం కూడా అందించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోలీసులు…

Read More

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ

ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్‌ ఆ తర్వాత సినిమాల…

Read More

పుష్ప2 కోసం స్టార్ క్రికెటర్లు బరిలో దిగుతున్నారా?

అల్లు అర్జున్ రీసెంట్ సెన్సేషన్ పుష్ప2 చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే ప్రచారపర్వంలో ఎక్కడా తగ్గకూడదని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రచారం కోసం భారీ ప్లాన్ వేశారు. దానికి తగ్గట్టుగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం జరుగుతోంది. వివిధ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈవెంట్స్ ను నిర్వహించే స్కెచ్ వేసింది. నార్త్ ఇండియాలోని అన్ని స్టేట్స్ లో కూడా ఈ…

Read More

వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదా తేలాలంటే ఇంకో నెల ఆగాల్సిందే..

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదాలో వచ్చిన విబేధాల మీద విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు డిసెంబర్ 13కి వాయిదా వేస్తున్నట్టు ఎన్సీఎల్టీ ప్రకటించింది. దాంతో ఈ వ్యవహారంలో స్పష్టతకు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. సరస్వతి పవర్ లో వైఎస్ జగన్, ఆయన భార్య భారతి పేరు మీద ఉన్న వాటాలను వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ గా రాశారు. దానిని…

Read More

కెప్టెన్ మీద కోపగించి గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన క్రికెటర్..!

క్రికెట్లో చాలామందికి టెంపర్ మెంట్ ఉంటుంది. కొందరు దాన్ని ఫీల్డ్ లోనే ప్రదర్శిస్తారు. అలాంటిదే ఒకటి తాజాగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే సందర్భంగా బయటపడింది. విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అనూహ్యంగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. తన బౌలింగ్ లో కెప్టెన్ నిర్ణయం నచ్చలేదని డ్రెస్సింగ్ రూమ్ కి దారితీశాడు. దాంతో కొంతసేపు ఆ జట్టు పది మందితోనే ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తీరుతో జోసెఫ విబేధించి…

Read More