Editor

కంగనా కథ నమ్మేసి అభాసుపాలయిన ఆంధ్రజ్యోతి!

ఆంధ్రజ్యోతి తప్పులో కాలేసింది. నిర్ధారణ లేని వార్త రాసి చేతులు కాల్చుకుంది. మరి తప్పిదాన్ని సరిదిద్దుకునేలా రేపు పాఠకులకు అసలు వాస్తవం చెబుతుందో లేదో చూద్దాం. అందరికీ నీతులు చెప్పే బల్లి కుడితిలో పడిందన్న నానుడి చందంగా వేమూరి రాధాకృష్ణ పత్రిక తీరు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెక్యూరిటీలో మహిళా అధికారి ఉన్నట్టుగా ఫోటోతో వార్త ఇచ్చింది. కానీ అది అది వాస్తవం కాదు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాడీగార్డ్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా…

Read More

సీఎం రమేశ్ ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి పంపించిన ఎంపీ

అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తగదంటూ ఆయనకు సహచర మంత్రి హితువు పలికారు. ఖరీదైన కానుకలతో ఎంపీలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ తీరుతో సీఎం రమేశ్‌ ఖంగుతినాల్సి వచ్చింది. పార్లమెంట్ లో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని కమిటీ స్టడీ టూర్ కి వెళ్లిన సమయంలో కమిటీ సభ్యులకు…

Read More

ఆ పెళ్లి మీద ట్రోలింగ్ ఎందుకు బ్రో..?

సినీ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. అందులో హీరో ప్రభాస్, టీవీ స్టార్లు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్ల పేర్లుంటాయి. చాలాకాలం పాటు వెయిట్ చేసిన సుబ్బరాజు ప్రస్తుతం వాళ్ల లిస్టు నుంచి బయటపడడం విశేషమే. చాలాకాలంగా తన పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్న సుబ్బరాజు తాజాగా తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్…

Read More

నాగార్జున వియ్యంకుడు దుబాయ్ లో చానా రిచ్!

అఖిల్ అక్కినేని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పటికే ఓసారి జీవీకే మనుమరాలు శ్రేయస్ భూపాల్ తో నిశ్చితార్థం వరకూ వెళ్ళి వెనక్కి తగ్గిన ఈ అక్కినేని చిన్నోడు ఈసారి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన సహచరి జైనబ్ రావుడ్జీతో పెళ్లికి రెడీ అవుతున్నాడు. జైనబ్ కుటుంబానికి దుబాయ్ లో పెద్ద నెట్ వర్క్ ఉంది. పశ్చిమాసియాలోనే పలుకుబడి కలిగిన బడా బిజినెస్ మేన్ ఆమె తండ్రి. గతంలో ఎనర్జీ సెక్టార్ లో…

Read More

జమ్మలమడుగు ఆదినారాయణ సంగతి చూస్తామంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. ఇప్పటికే అదానీ సంస్థల కాంట్రాక్ట్ తీసుకున్న సీఎం రమేశ్ తో తగాదా ఏకంగా ఆస్తుల ధ్వంసం వరకూ వెళ్లింది. తాజాగా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు అడ్డుకునే వరకూ సాగుతోంది. దీని మీద జేసీ ఘాటుగా స్పందించారు. కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్‌ తరలిస్తున్న జేసీకి చెందిన వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తమ…

Read More

ఈవీఎంల భాగోతం బయటపడుతున్నా, విపక్షాలు ఎందుకలా ఉంటున్నాయి?

పోలయిన ఓట్ల కన్నా ఎక్కువే లెక్కిస్తున్నారుఈవీఎం ఛార్జింగ్ ఎక్కడా తగ్గడం లేదువీవీ పాట్ల లెక్క తేల్చడం లేదుఈవీఎంలు ఓటేసిన వాళ్లే రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు దేశంలో ఎన్నికల వ్యవస్థ చుట్టూ సందేహాలు చెలరేగుతున్నాయి. ఈ అనుమానాలు రానురాను బలపడుతున్నాయి. ఇప్పటికప్పుడు అపోహలు తొలగించాల్సిన ఎన్నికల కమిషన్ వాటికి మరింత ఊతమిస్తోంది. ప్రజల్లోంచి వస్తున్న సందేహాలు తీర్చడానికి ససేమీరా అంటోంది. భవిష్యత్తులో ఇది పెను దుమారం దిశగా సాగుతోంది. మహారాష్ట్రలో తాము ఓటేసిన పార్టీకి సున్నా ఓట్లు వచ్చి…

Read More

అనుష్క శర్మ ఉంటేనే కోహ్లీ సెంచరీలా?

విరూష్క అంటూ పిలుచుకునే ఈ జంట గురించి అనేక ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ కి తెలుసు. తాజాగా టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మరో విషయం వెలుగులోకి తెచ్చాడు. అనుష్క శర్మ స్టాండ్స్ లో ఉంటే విరాట్ రెచ్చిపోతుంటాడంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకు గతంలో జరిగిన పరిణామాలను ఉదహరించాడు. తాజాగా పెర్త్ టెస్ట్ లో విరాట్ సెంచరీ చేసిన సమయంలో అనుష్క శర్మ అక్కడే ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. 2015 లో రావిశాస్త్రి మన…

Read More

ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. తాత్కాలిక కెప్టెన్ జస్ఫ్రిత్ బుమ్రా అధ్భుతంగా రాణించి జట్టుని విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా సెనా దేశాల గడ్డ మీదనే అత్యధిక తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో ఏకంగా 295 రన్స్ ఆధిక్యంతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గత సీజన్ లో జరిగిన పెర్త్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. న్యూజీలాండ్‌తో సొంత గడ్డపై 0-3 తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. ఆసీస్ గడ్డపై జరుగుతున్న బీజీటీ…

Read More

రిషబ్ పంత్ కొత్త రికార్డు, శ్రేయస్ అయ్యర్ తో ఆషామాషా కాదు

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025లో టీమిండియా ప్లేయర్లు దుమ్ము రేపుతున్నాడు. ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పొతున్నారు. సెట్ 1లో ఉన్న రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పరమయ్యాడు. చివరి వరకూ దిల్లీ ఆర్ టీ ఎం ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీ మొత్తానికి ఎల్ఎస్జీ ఆఫర్ చేయడంతో పంత్ లక్నో టీమ్ సొంతమయ్యాడు. అయితే అందరూ ఊహించిన విధంగా పంత్ కోసం సీఎస్కే, ఆర్సీబీ ఆసక్తి చూపకపోవడం విశేషం. కొంత సేపు…

Read More