రాధాకృష్ణ అసలు బాధేంటి? నిజంగా బాబుకి పాలన మీద పట్టు చిక్కడం లేదా?

చంద్రబాబు పాలనలో ఏమీ బాలేదా..చంద్రబాబు రాజకీయాలు చేయలేకపోతున్నారా..వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌ పోటీ పడితే నారా లోకేశ్ వాళ్లను ఎదుర్కోలేరామర్రి చెట్టు కింద మొక్కలా లోకేశ్ మిగిలిపోతున్నారాఅసలెందుకిలా ఏబీఎన్ ఎండీ మండిపడే పరిస్థితి వచ్చింది. ఆసక్తికరమైన రాతలతో రాధాకృష్ణ తీరు చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన అనేక కథనాలు ప్రస్తావించడం, ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు దాని మాటే మరచిపోవడం ఆనవాయితీ. ఆ మధ్య సానా ముదురు అంటూ ఎంపీ సానా సతీశ్ గురించి…

Read More

అచ్చెన్నాయుడి సోదరుడైతే రిటైర్మెంట్ తర్వాత కూడా పోస్టింగ్!

ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథనం వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత బుడితి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి సర్వీస్ పొడిగింపునకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి బాబాయ్ అయిన కింజరాపు ప్రభాకర్ కి రిటైర్మెంట్ తర్వాత ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దాని మీద ఏమంటుందో మరి జ్యోతి. జ్యోతి రాతలు పక్కన పెడితే రాష్ట్రంలో…

Read More

సాగనంపాల్సింది రోహిత్ నే కాదు, అతడిని కూడా!

టీమిండియా మేనేజ్మెంట్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మను సాగనంపేసింది. కీలకమైన చివరి టెస్టులో ఆయన్ని పక్కన పెట్టేసింది. వైస్ కెప్టెన్ బుమ్రాకే సారధ్యం దక్కింది. పెర్త్ టెస్టులో గెలుపుబాట పట్టించిన సారధికి చివరి మ్యాచ్ లో కూడా ఛాన్స్ రావడంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి, సిరీస్ ను డ్రా చేస్తారా అన్నది ఆసక్తికరం. సిరీస్ మధ్యలో కెప్టెన్ ను పక్కన పెట్టడం టీమిండియాలో అరుదైన అంశం. గతంలో 1985లో కపిల్ దేవ్…

Read More

బాహుబలిని బీట్ చేసిన పుష్ప2! ఇక మిగిలింది ఆ సినిమానే!

ఇండియన్ మువీ ఇండస్ట్రీలో పుష్ప2 కొత్త రికార్డ్ బ్రేక్ చేసింది. టాలీవుడ్ సత్తాను చాటిచెప్పింది. బాహుబలిని బీట్ చేసి రికార్డ్ కలెక్షన్లు సాధించింది. 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1799 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొత్త రికార్డ్ నెలకొల్పింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ మువీ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు ను పుష్ప 2 బ్రేక్ చేసినట్లు అయింది. బాహబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1788 కోట్ల రూపాయల…

Read More

పీకే అక్కడ ఏమీ పీకలేకపోతున్నారు, యువత తిరుగుబాటుతో తలపట్టుకున్న నేత

ఎన్నికల వ్యూహకర్త ముసుగులో సకల అరాచకాలకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిషోర్ కి సొంత రాష్ట్రంలో చీవాట్లు తప్పడం లేదు. 2014లో బీజేపీ, 2019లో వైఎస్సార్సీపీ, 2024లో టీడీపీ కోసం పనిచేసి అడ్డమైన పనులతో ప్రజలను నమ్మించడానికి తెగించిన ఈ తుంటరికి తగిన శాస్తి జరుగుతోందంటూ గిట్టని వారు సంతోషపడుతుండడం విశేషం. ఒక ఎన్నికల్లో బీజేపీకి, ఆ వెంటనే కాంగ్రెస్ కి కూడా పనిచేసిన నేపథ్యం అతడిది. ఏపీలో కూడా వైఎస్సార్సీపీకి, టీడీపీ కి మద్ధతుగా నిలిచిన…

Read More

బాబు స్కెచ్ పెద్దది..కానీ అంత సీన్ ఉంటుందా?

గోదావరి జలాలను రాయలసీమ తరలించడం గురించి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం అంటూ 2014-19 మధ్య పలుమార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడది తెరమరుగయ్యింది. కొత్తగా బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ముందుకు తెచ్చారు. డీపీఆర్ సిద్ధంచేసి, మూడు నెలల్లో టెండర్లని చెబుతున్నారు. పైగా ఇదే ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ వర్ణించారు. ఎప్పుడైనా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అందరూ ఆహ్వానించాలి. అది అవసరం. కానీ…

Read More

దళిత చేతిలో బీజేపీ పగ్గాలు పెడతారా, వ్యూహాత్మక ప్రచారమా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కొంతకాలంగా నానుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరిన జేపీ నడ్డా రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆయన పార్టీ పగ్గాలు మోస్తానని ప్రకటించారు. కానీ తీరా 8 నెలలుగా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నూతన అధ్యక్షుడి విషయంలో స్పష్టత వస్తుందన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి…

Read More

స్నికో మీటర్ ముఖ్యమా, డిఫ్లెక్షనా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ టెస్టులో టీమిండియా బ్యాటర్ యశశ్వీ జైస్వాల్ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. స్నికో మీటర్ లో ఎటువంటి సౌండ్ రికార్డ్ కాకపోయినా థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించగా, ప్యాట్ కమిన్స్ డీఆర్ఎస్ కోరడంతో దానిని అవుట్ గా నిర్దారించారు. దాని మీద బ్యాటర్ కూడా అభ్యంతరం పెట్టినా అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం పెద్ద చర్చకు ఆస్కారమిచ్చింది….

Read More

నితీశ్ కెరీర్ కి మీడియా హైప్ ముప్పుగా మారుతుందా?

టీమిండియా ఆటగాళ్ళను ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పతనానికి పడేయడం చాలా సహజం. ఒక్క మ్యాచ్ లో లేదా ఒక సిరీస్ లో రాణించగానే అంతా, ఇంతా అంటూ కొనియాడడం, అంతలోనే కొన్ని ఫెయిల్యూర్స్ కి తీవ్రంగా నిందించడం అనేది అభిమానులకే కాదు మీడియాకు కూడా అలవాటు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఉదంతం చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. మెల్బోర్న్ లో అద్భుతంగా రాణించిన ఆటగాడి పట్ల మీడియా స్పందించిన తీరు అతిగా ఉందనే వాదన వినిపిస్తోంది….

Read More

చంద్రబాబుకి పోలీసు విన్నపం, వైరల్ అవుతున్న లేఖ! రాసినందుకు చర్యలు ఖాయమా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డీసీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ పేరుతో రాసిన లేఖ వైరల్ అవుతోంది. తీవ్ర మనోవేధనతో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతనలేదంటూ పోలీస్ శాఖ ఉద్యోగి వాపోయిన తీరు వైరల్ అవుతోంది. తమ మీద ఇంత వివక్ష ఎందుకంటూ ప్రశ్నించిన తీరు ఆలోచన రేకెత్తించేలా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్…

Read More