చంద్రబాబు మీద వెంకయ్య అనుమానం!

చంద్రబాబు సామర్థ్యం మీద నమ్మకం ఉందని చెబుతూనే తాము కదులుతుండగానే అమరావతి పూర్తి చేయాలని బహిరంగంగానే చెప్పడం ద్వారా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తిగా వ్యాఖ్యానించారు. అమరావతి పనుల మీద ప్రజల్లో ఇప్పటికే సందేహాలున్నాయి. ఇప్పుడు వెంకయ్య కూడా అలాంటి అనుమానాలు రేకెత్తించడం ఏపీ రాజధాని భవితవ్యం మీద సందేహాలు బలపడుతున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో

Read More

అమరావతి ఓ చిన్న మునిసిపాల్టీ! అనుమానాలు పెంచిన చంద్రబాబు

అమరావతి నగరంలో ఇప్పటికే ఉన్న భూముల్లో మాత్రమే నిర్మించే ప్రాంతం ఓ చిన్న మునిసిపాలిటీ స్థాయికి మాత్రమే పరిమితమవుతుందంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దాని వెనుక అసలు లక్ష్యం ఏంటి, అమరావతి ప్రాంతం మీద అనుమానాలెందుకు బలపడుతున్నాయి. వీడియో లింక్ క్లిక్ చేయండి పూర్తి విశ్లేషణ కోసం

Read More

ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?

ఆంధ్రప్రదేశ్‌ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు. అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు…

Read More

రాధాకృష్ణ అసలు బాధేంటి? నిజంగా బాబుకి పాలన మీద పట్టు చిక్కడం లేదా?

చంద్రబాబు పాలనలో ఏమీ బాలేదా..చంద్రబాబు రాజకీయాలు చేయలేకపోతున్నారా..వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌ పోటీ పడితే నారా లోకేశ్ వాళ్లను ఎదుర్కోలేరామర్రి చెట్టు కింద మొక్కలా లోకేశ్ మిగిలిపోతున్నారాఅసలెందుకిలా ఏబీఎన్ ఎండీ మండిపడే పరిస్థితి వచ్చింది. ఆసక్తికరమైన రాతలతో రాధాకృష్ణ తీరు చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన అనేక కథనాలు ప్రస్తావించడం, ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు దాని మాటే మరచిపోవడం ఆనవాయితీ. ఆ మధ్య సానా ముదురు అంటూ ఎంపీ సానా సతీశ్ గురించి…

Read More

అచ్చెన్నాయుడి సోదరుడైతే రిటైర్మెంట్ తర్వాత కూడా పోస్టింగ్!

ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథనం వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత బుడితి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి సర్వీస్ పొడిగింపునకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి బాబాయ్ అయిన కింజరాపు ప్రభాకర్ కి రిటైర్మెంట్ తర్వాత ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దాని మీద ఏమంటుందో మరి జ్యోతి. జ్యోతి రాతలు పక్కన పెడితే రాష్ట్రంలో…

Read More

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సిగ్గుపడాల్సిన విషయం! ఏపీకి ఇలా, కర్ణాటకలో అలా!

వైజాగ్ స్టీల్ అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అతలాకుతలం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థానంలో ఉన్న సంస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరితీసే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో అందుకు భిన్నంగా సాగుతోంది. భద్రావతిలో ఉన్న సర్ ఎం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు పెద్దమొత్తంలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా 15వేల కోట్ల…

Read More

నారా దేవాన్ష్ రికార్డ్, వేగంగా పావులు కదుపుతున్న సీఎం మనవడు

మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ “చెక్‌మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డును…

Read More

ఆలయ కమిటీల్లో ఆ రెండు కులాలకు చోటు, మరి మిగిలిన వాళ్లేం చేశారు?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పాలకమండళ్ల నియామకాలకు సిద్ధమవుతోంది. ఆక్రమంలో కొత్తగా కమిటీల్లో రెండు కులాల వారికి చోటు కల్పించాలని నిర్ణయించింది. అందులో బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ దేవాలయ కమిటీల్లో ఆయా ప్రాంతాలను బట్టి కమిటీల్లో చోటు లభిస్తుంది. కులాల వారీగా కేటాయింపులు లేవు. కానీ తొలిసారిగా ఆ రెండు కులాల వారికి చోటు కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి….

Read More

కార్యకర్తలే బలిపశువులు, చంద్రబాబు, జగన్ ఎవరైనా అదే తంతు!

అధికారంలో టీడీపీ ఉందా లేక వైఎస్సార్సీపీనే కొనసాగుతుందా అన్నది తెలీయడం లేదు- ఇదీ ఓ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అంతకుముందు వైఎస్సార్సీపీ హయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఇంకా చెప్పాలంటే మేమంతా కష్టపడితే గెలిచిన సీఎం ఈయనేనా అని అప్పుడూ, ఇప్పుడూ సందేహించే పరిస్థితి ఆయా పార్టీల శ్రేణుల్లో ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఏలూరు పరిస్థితి చూద్దాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణుల మీద పలు కేసులు పెట్టారు. ఆ…

Read More

జగన్ పుంజుకుంటున్నాడంటున్న ఏబీఎన్ ఆర్కే, ఎందుకలా?

ఏబీఎన్ రాధాకృష్ణ ఆందోళన చెందుతున్నాడా.. చంద్రబాబు పాలనా తీరుతో అసంతృప్తిగా ఉన్నారా.. బాబు విధానాల కారణంగా మళ్లీ వైఎస్ జగన్ కి ఆదరణ పెరుగుతోందని కలత చెందుతున్నారా. తాజాగా ఆయన రాతలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. వైఎస్ జగన్ పుంజుకుంటున్నారని ఆందోళన చెందుతున్నట్టు చాటుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి బలపడుతున్న అంశాన్ని వేమూరి రాధాకృష్ణ తన వీకెంట్ కామెంట్ లో పరోక్షంగా చెప్పేశారు. చంద్రబాబుని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించేశారు. సీఎంగా అద్భుత పనితీరు అంటే విజన్…

Read More