ఊగిసలాటలో పీఏసీ చైర్మన్, పెద్దరెడ్డికి దక్కేనా?

పీఏసీ చైర్మన్ గిరీ కొత్త మలుపు తిరిగింది. దాదాపుగా పెద్దిరెడ్డికి ఖాయం అనుకున్న దశలో కూటమి నేతలు మెలిక పెట్టారు. జనసేన తరుపున కూడా నామినేషన్ దాఖలయ్యింది. దాంతో వ్యవహారం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీకి పీఏసీ చైర్మన్ గిరీ రాకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. అయితే అధికారకూటమి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తుందా లేక సభలో ఏకైక విపక్షానికి ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్టుకి సంబంధించి ఓ…

Read More

బాహుబలిలో బిజ్జాలదేవుడిలా జగన్ కి సజ్జల అన్నట్టేనా, ఎందుకలా?

బాహుబలి గుర్తుంది కదా. అందులో బిజ్జలదేవుడి పాత్రనే సజ్జల రామకృష్ణారెడ్డి పోషిస్తున్నారా.. ఎందుకో వైఎస్సార్సీపీ క్యాడర్ లో మెజార్టీ అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. అధికారంలో ఉండగా అన్నీ తానై అన్నట్టుగా చక్రం తిప్పిన సజ్జల తీరు మీద నోరుమెదపలేకపోయారు గానీ ఆ తర్వాత చాలా గగ్గోలు పెట్టారు. అయినా గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వెంట సజ్జల మినహా మరొకరికి ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్…

Read More

తెలుగు రాష్ట్రాల విపక్షాలది ఒకే వ్యూహమా? అరెస్టు కోసం ఎదురుచూస్తున్నారా?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో Arrest Me అనే కామెంట్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ Arrest Me కామెంట్లపై చర్చ పెరిగింది. తెలంగాణలో Arrest Me రాగాన్ని కేటీఆర్ గత కొంత కాలంగా ఆలపిస్తుంటే.. తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా అదే తరహా రాగం అందుకున్నారు. హైదరాబాదులో ఫార్మూలా-ఈ రేసింగ్ కోసం 55 కోట్ల రూపాయలను కెబినెట్ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారనేది బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్…

Read More

జగన్ ఇల్లు ప్యాలెస్ అయితే చంద్రబాబుది నివాసం మాత్రమే ఎలా అయ్యింది?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని సీఎం ఇల్లు అనే అంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి ఇంటిని మాత్రం తాడేపల్లి ప్యాలెస్ అంటారు. నిజానికి చెప్పాలంటే సీఎం చంద్రబాబు నివశిస్తోంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడం. ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్న నదీ గర్భంలో ఉన్న భవనం. అయినా దానిని జనం అంగీకరించేలా చేయడం సాధారణ నైపుణ్యం కాదు. అది నేరం కాదని జనాలను నమ్మించడం చిన్న విషయం కాదు. హైకోర్టు నోటీసులు ఇచ్చిన భవనంలో…

Read More

వాలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు

వాలంటీర్ల వ్యవస్థ అమలుపై ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన అధినేతలు ఊదర గొట్టారు.వైసిపి ప్రభుత్వం ఇస్తున్న 5000 జీతం కంటే మెరుగైన గౌరవ వేతనం ఇస్తాం.వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం. వాలంటిర్లలో డిగ్రీ , పీజీ చేసిన వారు కూడా ఉన్నారు.వారికి శిక్షణ ఇచ్చి సాప్ట్ వేర్ ఉద్యోగులుగా తీర్చి దిద్దుతాము.తమపై వైసిపి చేసే ప్రచారాన్ని నమ్మకండని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలను కోరారు.ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించింది.మంత్రులకు శాఖలు కేటాయింపులో వార్డు వాలంటర్…

Read More

రాహుల్ గాంధీకి వర్తించని నిభందన…మీకు ఎలా సాధ్యం జగన్ ?

ప్రభుత్వ విధానాలను చర్చిండానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి గొప్ప వేదికలు చట్ట సభలు.అలాంటి ప్రజాస్వామ్య అవకాశం అందరికి దొరుకుతుందా? రాజ్యంగ బద్ధ సంస్థ ద్వారా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శాసనసభ్యలు ఆ విషయాన్నే మర్చిపోయారా? ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు అసెంబ్లీ ఎందుకు అని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తున్నారు? పార్టీ కార్యాలయం నుంచే పాలక పార్టీ ని ప్రశ్నిస్తూ ఉంటాము అని ప్రకటిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధికార ప్రతినిధి వరకు…

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకున్న వైఎస్సార్సీపీ!ఎవరికి కలిసొస్తుంది?

ఏపీలో శాసనమండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని ఆపార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతిభద్రతల కారణంగా ఎన్నికల తీరు మీద తమకు విశ్వాసం లేదని ప్రకటించింది. రెండు జిల్లాల పార్టీ నేతలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. నాయకుల అబిప్రాయం సేకరించారు. తొలుత కార్మిక నాయకుడు పి గౌతమ్ రెడ్డిని పోటీలో పెట్టాలని భావించిన వైఎస్సార్సీపీ చివరకు…

Read More

ఆడబిడ్డల భద్రతకు ఒక్క చట్టమైనా తెచ్చారా? : రోజా

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కక్షతో దిశా పోలీస్ స్టేషన్ లను నిర్వీర్యం చేయడం తప్ప..ఆడపిల్లల భద్రత కోసం ఒక్క చట్టమైన తీసుకువచ్చారా? హోం మంత్రి ఎక్కడ ఉన్నారు? నేరస్థులకు ఎందుకు భయాన్ని కల్పించలేకపోతున్నారు అని ప్రశ్నించారు. శనివారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరిలో మూడేళ్ల పాపపై అత్యాచారం చేసి…

Read More

వైయస్ షర్మిలకు భద్రత అవసరమా ? : కాకాని గోవర్ధన్

మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకొని వై. యస్. షర్మిలకు తాము భద్రత కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.శనివారం నెల్లూరు లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందాకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్…

Read More