R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ ఇక సెలవు చెప్పేశాడు!

టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ కి గుడ్ బై చెప్పేశాడు. ఊహించినట్టుగా ఈసిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తే అందుకు భిన్నంగా మూడో టెస్ట్ ముగియగానే తన నిర్ణయాన్ని అశ్విన్ ప్రకటించాడు. బ్రిస్టేన్ టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్ ప్రకటించడంతో టీమిండియాలో ఓ శకం ముగిసినట్టుగా భావించాలి. గతంలో ధోనీ కూడా ఇదే రీతిలో సిరీస్ మధ్యలో తన రిటైర్మెంట్ ప్రకటించిన అనుభవం ఉంది. ఆసీస్ గడ్డ మీద బోర్డర్…

Read More

అదానీ కేసులో ఏపీ ఐఏఎస్ లు కూడా ఇరుక్కుంటారా?

అదానీ సంస్థల మీద అమెరికాలో నమోదయిన కేసు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయంగానూ, అధికార వర్గాల్లోనూ విస్తృత చర్చకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయం రంజుగా సాగుతోంది. అమెరికా అధికారులు కోర్టులో సమర్పించిన పత్రాల్లో మాజీ సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఏపీలో దీనికి సంబంధించి హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఓవైపు ఈ రాజకీయం రంజుగా సాగుతుండగానే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఓ ట్విట్ ఈ ఎపిసోడును…

Read More

కేఎల్ రాహుల్ అవుటా, నాటవుటా, ఎందుకీ వివాదం?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గడ్డు పరిస్థితిలో పడింది. టాప్ ఆర్డర్ నాలుగు వికెట్లు కోల్పోయింది. యంగ్ బ్యాటర్లు యశశ్వి జైశ్వాల్, పడిక్కల్ డకౌట్లుగా వెనుదిరగగా, ఆ తర్వాత కింగ్ కోహ్లీ కూడా స్వల్ప స్కోర్ కే అవుటయ్యాడు. కొంత సేపు రిషబ్ పంత్ తో కలిసి ప్రతిఘటించిన రాహుల్ కూడా అవుట్ కావడంతో లంచ్ సమయానికి 51 రన్స్ కే నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ కి కొద్దిసేపటికి ముందు పెర్త్…

Read More

ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?

ఆంధ్రప్రదేశ్‌ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు. అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు…

Read More

బాలినేనికి మరో ఎదురుదెబ్బ, మాజీ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జనసేన

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన నాటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే. తాజాగా మరోసారి ఆశాభంగమయ్యింది. తొలుత ఆయన ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరాలని ఆశించారు. కానీ ఆపార్టీ అధిష్టానం అందుకు భిన్నంగా ఆలోచించింది. కనీసం బాలినేని అనుచరులను కూడా వెంట తీసుకురాకుండా ఆయనతో పాటు అతి కొద్దిమందికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అయినా సర్థుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని భారీ సభ…

Read More

మహానటి కీర్తి సురేష్ పెళ్లి మహుర్తం ఫిక్స్, భర్త ఎవరంటే?

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపీటలెక్కుతోంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో వివాహ వేడుక జరుగుతోంది. ఆమె చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడబోతోంది. ఈ పెళ్లికి గోవా వేదిక కానుంది. కీర్తి సురేష్ తెలుగులో ప్రముఖ హీరోలందరి సరసన నటించింది. మహానటి ద్వారా విశేష కీర్తి గడిచింది. ప్రతిభ కలిగిన నటిగా మన్ననలు పొందింది. అనేక అవార్డులు కూడా దక్కించుకుంది. జాతీయ స్థాయి ఉత్తమనటిగానూ ఎదిగింది. తాజాగా తన పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్ 11న కుటుంబ సభ్యులు,…

Read More
dsc recruitments

డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కారు ఆటలు!

అదిగో డీఎస్సీ..ఇదిగో నోటిఫికేషన్ అంటూ ఊరిస్తున్నారు. ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయింది. అయినా తొలి ఐదు సంతకాల్లో ఒకటైన డీఎస్సీ నోటిఫికేషన్ కి మోక్షం లేదు. ఇది ఆశావాహులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. నిరుద్యోగ ఉపాధ్యాయులతో ఆటలాడుతున్నట్టుగా ఉంది. నవంబర్ 3న నోటిఫికేషన్ అంటూ తొలుత ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ విదేశీయాత్ర ముగించుకుని రాలేదని 6వ తేదీకి వాయిదా వేశారు. తీరా ఆరు నాడు కూడా రిలీజ్ కాలేదు. మరో వారం పడుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటన….

Read More

వైయస్ షర్మిలకు భద్రత అవసరమా ? : కాకాని గోవర్ధన్

మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకొని వై. యస్. షర్మిలకు తాము భద్రత కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.శనివారం నెల్లూరు లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందాకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్…

Read More