విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ కలిసి ఒకే టీమ్ కి ఆడబోతున్నారు..!

అవును.. నిజమే. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడబోతున్నారు. ఛాంపియన్స్ ట్రోపీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకే బీసీసీఐ సిద్ధంగా లేని దశలో పాకిస్తాన్ ప్లేయర్ తో కలిపి టీమిండియా ఆటగాడు ఆడడం ఏమిటనుకుంటున్నారా.. అదే జరగబోతోంది. ఇద్దరూ కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరే కాదు.. పాకిస్తాన్, టీమిండియా నుంచి మరికొందరు ప్లేయర్లు కూడా ఆ టీమ్ లో ఉంటారు.. ఆఫ్రో ఆసియన్ కప్ మరోసారి నిర్వహించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించడంతో…

Read More

ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ వివాదాలు, అడుగులు పడేనా?

ఏపీకి కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది అంతుబట్టకుండా ఉంది. ఆఖరికి అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్ల నిధులు కూడా అప్పుగానా, గ్రాంట్ గానా అన్నది సందేహంగా కనిపిస్తోంది. ఈ సందిగ్ధం కొనసాగుతున్న వేళ తాజాగా కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ ప్రకటనలు చిచ్చుపెడుతున్నాయి. బహుశా పౌరవిమానయాన శాఖ టీడీపీ ఎంపీ చేతిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే ఎక్కువ ఫలితాలను ఆశిస్తూ ఎయిర్ పోర్టుల చుట్టూ హంగామా చేస్తున్నారా అన్న చర్చ…

Read More

కడప రెడ్డమ్మకు అవమానమా, ఎమ్మెల్యే మాధవి నిరసన

కడప రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్ వ్యవహారాల్లో పెత్తనం కోసం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి మేయర్ సురేష్ బాబు కి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. తాజాగా మేయర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే కుర్చీలు కూడా తీసివేయించారంటూ ఎమ్మెల్యే మాధవి ఆరోపిస్తున్నారు. తమను అవమానించారంటూ ఆమె నిరసనకు దిగారు. తాజాగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేయర్ స్పందించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్…

Read More

ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?

ఆంధ్రప్రదేశ్‌ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు. అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు…

Read More

రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉండడానికి కారణమదేనా, టాలీవుడ్ ఆశించింది జరిగేనా?

ఆకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి ఆకు మీద పడినా నష్టపోయేది ఆకు అన్నది నానుడి. సరిగ్గా టాలీవుడ్ కి ఇది వర్తించేలా కనిపిస్తోంది. పాలకపక్ష నేతకు కోపం వచ్చినా టాలీవుడ్ కే నష్టం. టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆగ్రహం కలిగినా వాళ్లే నష్టపోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్- రేవంత్ రెడ్డి ఉదంతం అందుకు సాక్ష్యంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అందుకు కొనసాగింపుగానే కనిపిస్తోంది. ప్రభుత్వాలకు…

Read More

కెప్టెన్ మీద కోపగించి గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన క్రికెటర్..!

క్రికెట్లో చాలామందికి టెంపర్ మెంట్ ఉంటుంది. కొందరు దాన్ని ఫీల్డ్ లోనే ప్రదర్శిస్తారు. అలాంటిదే ఒకటి తాజాగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే సందర్భంగా బయటపడింది. విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అనూహ్యంగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. తన బౌలింగ్ లో కెప్టెన్ నిర్ణయం నచ్చలేదని డ్రెస్సింగ్ రూమ్ కి దారితీశాడు. దాంతో కొంతసేపు ఆ జట్టు పది మందితోనే ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తీరుతో జోసెఫ విబేధించి…

Read More

రాజకీయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్!

వర్తమాన ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం పడని రంగం లేదు. ఇప్పటికే గూగుల వంటి సంస్థలు కూడా తమ సిబ్బందిలో 10 శాతం మందిని ఇంటికి సాగనంపబోతున్నట్టు ప్రకటించేశాయి. అదంతా ఏఐ ప్రభావమేనని చెబుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నేతలు కూడా ఏఐ వాడకం విస్తృతం చేస్తున్నారు. ప్రచారానికి దానిని విరివిగా వాడే ప్రయత్నంలో ఉన్నారు. కృత్రిమ మేథ సహాయంలో మరణించిన వారందరి ఆశీస్సులు తమకే ఉన్నాయని చాటేందుకు తగ్గట్టుగా వీడియోలు, ఫోటోలు ప్రచారంలో పెడుతున్నారు. అదే…

Read More

ఏపీ పీఏసీ కోసం ఎన్నికలే, ఏకగ్రీవానికి అంగీకరించని కూటమి నేతలు

సంప్రదాయానికి భిన్నంగా సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని విపక్షానికి అప్పగించడం 1966 నుంచి అమలవుతోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆపార్టీ పక్షాన పులవర్తి రామాంజనేయులుకి పీఏసీ దక్కబోతోంది. తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగానే ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. తీరా అందుకు భిన్నంగా జనసేన నేతను బరిలో దింపాలని కూటమి నేతలు…

Read More