అప్పుగా కాదు…కేంద్ర గ్రాంట్ గా నిధులు ప్రకటించాలి : సి.హెచ్ బాబురావు
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు కోరారు. శనివారం తుళ్లూరులో సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై మళ్ళీ అనిశ్చిత పరిస్థితి తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా,పటిష్టంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగినందున…
జగన్ ఇల్లు ప్యాలెస్ అయితే చంద్రబాబుది నివాసం మాత్రమే ఎలా అయ్యింది?
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని సీఎం ఇల్లు అనే అంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి ఇంటిని మాత్రం తాడేపల్లి ప్యాలెస్ అంటారు. నిజానికి చెప్పాలంటే సీఎం చంద్రబాబు నివశిస్తోంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడం. ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్న నదీ గర్భంలో ఉన్న భవనం. అయినా దానిని జనం అంగీకరించేలా చేయడం సాధారణ నైపుణ్యం కాదు. అది నేరం కాదని జనాలను నమ్మించడం చిన్న విషయం కాదు. హైకోర్టు నోటీసులు ఇచ్చిన భవనంలో…
రాజ్యసభ రేసులో చింతకాయల విజయ్! 4దశాబ్దాల ప్రస్థానానికి ప్రతిఫలమా?
17 ఏళ్ల నిరీక్షణ…కష్టకాలంలో పరీక్షించబడిన నిబద్ధత…కుటుంబం మొత్తం తట్టుకున్న రాజకీయ ఒత్తిళ్లు…ఉత్తరాంధ్ర బీసీ స్వరానికి గుర్తింపు దక్కాల్సిన సమయం వచ్చిందనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది ! 1983 నుంచి తెలుగుదేశం పార్టీతో కుటుంబ అనుబంధం కొనసాగిస్తూ… అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా నిలబడిన నాయకత్వం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి రాజకీయ ప్రయాణమే చింతకాయల విజయ్‌ది !! రాజకీయంగా ఒత్తిళ్లు, కేసులు, దాడులు… కుటుంబంపై మానసిక భయాందోళనలు సృష్టించే పరిస్థితులు వచ్చినా…
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుందా, పనులేమయినా జరుగుతున్నాయా?
అమరావతిలో రాకపోకలకు కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం ఆరేళ్ల పాటు ఒక్క అడుగు కూడా పడలేదు. ఏపీ రాజధాని నగర నిర్మాణంలో ముఖ్యమైన రోడ్డు పనులు సాగకపోవడంతో సీఎం, చీఫ్ జస్టిస్ సహా అంతా అవస్థలు పడ్డారు. కరకట్ట రోడ్డుని ఆశ్రయించక తప్పని స్థితిలో సాగారు. అయితే రైతులు భూములివ్వకపోవడం వల్ల వెంకటపాలెంలో ఆగిన రోడ్డులో చిన్న పాటి కదలిక వచ్చింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో వీడియోలో చూడండి
ఇళయరాజా కొడుకు ముస్లీం మతంలోకి ఎందుకు మారాడు?
తమిళనాడులో ఆలయ ప్రవేశం నిరాకరించారన్న వార్తలతో ఇళయరాజా వార్తల్లోకెక్కారు. అయితే ఆయన గురించి తనయుడు యువన్ శంకర్ రాజా వెల్లడించిన చర్చనీయాంశమవుతున్నాయి. ఇళయరాజా తనయుడు ఇప్పటికే మతం మార్చుకున్నారు. ఆయన హిందూ మతం వీడి ముస్లీం మతం స్వీకరించారు. ఆ సమయంలో తన తండ్రి గురించి ఆయన కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు. “మా నాన్న హిందూమతాన్ని ఫాలో అవుతారు, ఆయనకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఇంట్లో చిన్న గాజుగ్లాసు పగిలినా, అదొక అపశకునమని పండితున్ని పిలిచి పూజలు…
దీపావళి హిట్ కొట్టేసిన ఆ మూడు సినిమాలు ఓటీటీలో ఎక్కడంటే..!
ఈసారి పండుగ సినీ ఇండస్ట్రీకి సంతోషాన్ని నింపింది. ఒకేసారి విడుదలయిన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందులో తెలుగు హీరో కిరణ్ అబ్బవరం సినిమా క మంచి మార్కులు దక్కించుకుంది. దాంతో పాటుగా తమిళ్ స్టార్ శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ తో పాటుగా మళయాళీ యంగ్ హీరో దుల్కర్ సల్మన్ స్ట్రయిట్ మువీ లక్కీ భాస్కర్ సైతం మంచి రెస్పాన్స్ సాధించాయి. పాజిటివ్ గా ఓపెనింగ్స్ కనిపించాయి. ఇప్పుడీ మూడు సినిమాలు…
జనసేన నాయకుడి ఇంట్లో బాలుడి అనుమానాస్పద మృతి, దర్యాప్తు కోసం ఆందోళన
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడి ఇంట్లో బాలుడి మృతి కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఎల్బీనగర్ కు చెందిన ఆటోడ్రైవర్ కుక్కల మల్లేశ్వరరావు కుమారుడు కుక్కల చరణ్ శ్రీ తేజ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ ఇంటికి సమీపంలోనే ఉన్న రాజేశ్వరి రెసిడెన్సీ వద్ద ఈ ఘటన జరిగింది. అపార్ట్ మెంట్ వాచ్…