జమిలీ ఎన్నికలకు రెడీ అవుతున్న వైఎస్సార్సీపీ, టీడీపీ అధిష్టానం కూడా సిద్ఢమా?

ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు తప్పవన్న అంచనాకు రాజకీయ పార్టీలు వచ్చేశాయి. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంటూ మోదీ పదే పదే చెబుతుండడంతో పరిణామాలు అనివార్యంగా భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా జమిలీ ఎన్నికలంటూ తమ క్యాడర్ కి పిలుపునిచ్చారు. మరో రెండేళ్లలో ఎన్నికలు అనివార్యమంటూ చెబుతున్నారు. రాబోయే ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని సూచిస్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగిసి ఇంకా ఆరు నెలలు కూడా గడవకముందే అప్పుడే…

Read More

ఏలూరు మెడికల్ కాలేజీకి యల్లాప్రగడ పేరు ఖరారు

ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాల పేరును “డా. ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు”గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలపడంతో కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మెడకిల్ కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి బయో కెమిస్ట్రీలో విశేష పరిధోనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన…

Read More

పుష్ప2 కోసం స్టార్ క్రికెటర్లు బరిలో దిగుతున్నారా?

అల్లు అర్జున్ రీసెంట్ సెన్సేషన్ పుష్ప2 చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే ప్రచారపర్వంలో ఎక్కడా తగ్గకూడదని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రచారం కోసం భారీ ప్లాన్ వేశారు. దానికి తగ్గట్టుగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం జరుగుతోంది. వివిధ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈవెంట్స్ ను నిర్వహించే స్కెచ్ వేసింది. నార్త్ ఇండియాలోని అన్ని స్టేట్స్ లో కూడా ఈ…

Read More

ఊగిసలాటలో పీఏసీ చైర్మన్, పెద్దరెడ్డికి దక్కేనా?

పీఏసీ చైర్మన్ గిరీ కొత్త మలుపు తిరిగింది. దాదాపుగా పెద్దిరెడ్డికి ఖాయం అనుకున్న దశలో కూటమి నేతలు మెలిక పెట్టారు. జనసేన తరుపున కూడా నామినేషన్ దాఖలయ్యింది. దాంతో వ్యవహారం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీకి పీఏసీ చైర్మన్ గిరీ రాకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. అయితే అధికారకూటమి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తుందా లేక సభలో ఏకైక విపక్షానికి ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్టుకి సంబంధించి ఓ…

Read More

జనసేన నాయకుడి ఇంట్లో బాలుడి అనుమానాస్పద మృతి, దర్యాప్తు కోసం ఆందోళన

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడి ఇంట్లో బాలుడి మృతి కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఎల్బీనగర్ కు చెందిన ఆటోడ్రైవర్ కుక్కల మల్లేశ్వరరావు కుమారుడు కుక్కల చరణ్ శ్రీ తేజ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ ఇంటికి సమీపంలోనే ఉన్న రాజేశ్వరి రెసిడెన్సీ వద్ద ఈ ఘటన జరిగింది. అపార్ట్ మెంట్ వాచ్…

Read More

అన్నం- చపాతి, ఏది బెస్ట్, ఏం తినాలి?

చాలామంది ఆహారం విషయంలో సందిగ్ధం ఉంటుంది. తమ ఆరోగ్యానికి ఏది మంచిదన్న సందేహాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో అన్నమే ప్రధాన ఆహారం. ఉత్తరాది రాష్ట్రాలలో రొట్టెలు, చపాతీలు ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ కాలం మారుతోంది. క్రమంగా ఆహారపు ఆలవాట్లలో కూడా మార్పులు వస్తున్నాయి. షుగర్, బిపి, అధిక బరువు, హార్మోన్ సమస్యలు వంటివి ప్రభావితం చేస్తున్న దశలో అందరూ ఆహారం మీద కేంద్రీకరణ పెంచుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం కోసమంటూ కొందరు అన్నానికి బదులు…

Read More

విశాఖలో ఆరుగురు అమ్మాయిలు మాయం, కళ్లలో కారం జల్లిపారిపోయారని ఫిర్యాదు

విశాఖ జిల్లాలో ఒకేరోజు ఆరుగురు అమ్మాయిలు పరారయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్వధార్ హోం నుంచి వారంతా పారిపోయారు. దాంతో ఈ ఘటన సంచలనంగా మారింది. పెందుర్తి మండలంలోని స్వధార్ గృహం నుంచి ఆరుగురు బాధిత యువతులు పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. వారంతా వివిధ కేసుల్లో న్యాయస్థానం నుంచి ఆదేశాల మేరకు స్వధార్ లో ఉంటున్నారు. వారికి తగిన సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా నిర్వాహకులను కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయినట్టు పోలీసులకు…

Read More

అప్పుగా కాదు…కేంద్ర గ్రాంట్ గా నిధులు ప్రకటించాలి : సి.హెచ్ బాబురావు

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు కోరారు. శనివారం తుళ్లూరులో సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై మళ్ళీ అనిశ్చిత పరిస్థితి తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా,పటిష్టంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగినందున…

Read More